News September 10, 2025
దువ్వాడ మీదుగా హైదరాబాద్ – భువనేశ్వర్‌కు ప్రత్యేక రైళ్లు

దసరా, దీపావళి సందర్భంగా రద్దీని తగ్గించేందుకు దువ్వాడ మీదుగా హైదరాబాద్ – భువనేశ్వర్‌కు (07165/66) ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు వాల్తేర్ డివిజన్ డీసీఎం సందీప్ మంగళవారం తెలిపారు. సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ 28 వరకు ప్రతి మంగళవారం హైదరాబాద్‌లో బయలుదేరి భువనేశ్వర్ చేరుకుంటుంది. మరుసటి రోజు (బుధవారం) భువనేశ్వర్ నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటుంది. ప్రయాణికులు గమనించాలని సూచించారు.
Similar News
News March 21, 2026
అల్లవరం: గల్లంతైన విద్యార్థి మృతదేహం లభ్యం

అల్లవరం మండలం ఓడలరేవు సముద్రంలో గల్లంతైన అమలాపురం నారాయణపేటకు చెందిన దొమ్మేటి లోకేశ్(17) మృతదేహం శనివారం లభ్యమయింది. ప్రమాద స్థలానికి సమీపంలో అతని మృతదేహాన్ని గుర్తించారు. స్నేహితులతో కలిసి స్నానం చేసేందుకు వెళ్లి సముద్రంలో లోకేశ్ శుక్రవారం గల్లంతైన విషయం విధితమే. అతని కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం లభ్యం కావడంతో అతని కుటుంబ సభ్యులు మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు.
News March 21, 2026
ADB: గ్యాస్ డెలివరీలో అలస్యమైతే.. కాల్ చేయండి

గ్యాస్ సరఫరా, డెలివరీలో ఆలస్యం లేదా ఇతర సమస్యలు ఎదురైతే ప్రజలు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. ఇందుకోసం టోల్ ఫ్రీ నంబర్ 1800 425 1939 అందుబాటులో ఉందని తెలిపారు. ప్రజలు అసత్య ప్రచారాలను నమ్మకుండా అధికారిక సమాచారం ఆధారంగా మాత్రమే స్పందించాలని, జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
News March 21, 2026
ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ

ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా దేవస్థానం కీలక నిర్ణయాలు తీసుకుంది. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు ₹500 అంతరాలయ దర్శనాలను నిలిపివేశారు. ఇదే సమయంలో వీఐపీ, ప్రొటోకాల్, బ్రేక్ దర్శనాలు కూడా రద్దు చేశారు. క్యూ లైన్లలో ఉన్న సామాన్య భక్తులు త్వరగా దర్శనం చేసుకునేలా ఈ చర్యలు చేపట్టారు. 2 గంటల తర్వాత పరిస్థితులను బట్టి తిరిగి టికెట్ల జారీ చేయనున్నారు.


