News April 4, 2024

పర్చూరులో జెండా పాతేది ఎవరు.?

image

పర్చూరు నియోజకవర్గంలో ఈసారి పోటీ ఆసక్తికరంగా మారింది. ఏలూరి సాంబశివరావు 2014, 19 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలుపొందారు. 2019లో కేవలం 1647 ఓట్ల మెజారిటీతో గెలుపొందగా, మరోసారి పోటీచేస్తూ హ్యట్రిక్‌పై కన్నేశారు. అటు ఎడం బాలాజీ 2019 చీరాల నుంచి వైసీపీ తరఫున పోటీచేసి ఓడిపోయారు. మరోసారి చీరాల టికెట్ ఆశించగా కుదరక పర్చూరు నుంచి బరిలో ఉన్నారు. మొత్తం 2,25,770 ఓట్లలో మెజారిటీ ఓట్లు సాధించి ఎవరు గెలుస్తారో.?

Similar News

News September 8, 2025

ఒంగోలు: యువతిపై లైంగిక దాడికి యత్నం

image

ఒంగోలు నియోజకవర్గం కొత్తపట్నం మండలంలో యువతిపై గుర్తుతెలియని వ్యక్తి లైంగిక దాడికి యత్నించిన ఘటన వెలుగులోకి వచ్చింది. కొత్తపట్నానికి చెందిన యువతి బహిర్భూమికి వెళ్లిన సమయంలో అతడు దాడికి యత్నించాడు. ఆమె కేకలు వేయగా స్థానికులు అక్కడికి చేరుకున్నారు. ఈలోపు నిందితుడు పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కొత్తపట్నం పోలీసులు గాలించి అతడిని అదుపులోకి తీసుకున్నారని సమాచారం.

News September 8, 2025

ఒంగోలు: పొగాకు రైతులకు గుడ్ న్యూస్

image

ప్రకాశం జిల్లాలోని పొగా రైతులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. సాధారణంగా ప్రభుత్వం పొగాకు సాగుపై కొన్ని పరిమితులు ఉంటాయి. ఆ మేరకు కొనుగోళ్లు చేస్తారు. లిమిట్‌కు మించి పండించిన పొగాను సైతం కొనేందుకు కేంద్ర వాణిజ్య శాఖ ముందుకు వచ్చిందని వెల్లంపల్లి పొగాకు వేలం కేంద్రం నిర్వహణ అధికారి రామకృష్ణ వెల్లడించారు. రైతులు అదనంగా పండించిన పంటను ఈనెల 9వ తేదీ నుంచి కొనుగోలు చేస్తామని చెప్పారు.

News September 8, 2025

ఒంగోలులో ప్రశాంతంగా ముగిసిన స్క్రీనింగ్ టెస్ట్ పరీక్షలు

image

ఒంగోలులో ఆదివారం అటవీశాఖ పోస్టుల భర్తీకై నిర్వహించిన స్క్రీనింగ్ టెస్ట్ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు DRO ఓబులేసు తెలిపారు. ఈ సందర్భంగా ఒంగోలు శివారు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 10 పరీక్ష కేంద్రాలను DRO ఆదివారం సందర్శించారు. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు 1153 మందికి గాను 901 మంది హాజరైనట్లు, మిగిలిన పోస్టులకు 7052 మందికి గాను 5642 మంది పరీక్షకు హాజరైనట్లు పేర్కొన్నారు.