News September 10, 2025

ఆ రైలుకు బేతంచెర్లలో స్టాపింగ్

image

కరోనా సమయంలో రద్దైన స్టాపింగ్‌లను ప్రయాణికుల సౌకర్యార్థం 137 స్టేషన్లలో పునరుద్ధరించినట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అందులో భాగంగా మచిలీపట్నం–యశ్వంత్‌పూర్ మధ్య నడిచే కొండవీడు రైలు (17211)కు ఈ నెల 10వ తేదీ నుంచి బేతంచర్ల స్టేషనులో రాత్రి 12:34 గంటలకు స్టాపింగ్ కల్పించారు. అదే విధంగా తిరుగు ప్రయాణం (17212)లో ఈ నెల 11వ తేదీ నుంచి బేతంచర్లలో రాత్రి 9:19 గంటలకు స్టాపింగ్ పునరుద్ధరించారు.

Similar News

News September 10, 2025

రెండు రోజుల్లో లిక్కర్ స్కామ్‌పై ఛార్జ్ షీట్..!

image

రెండు రోజుల్లో లిక్కర్ స్కామ్‌పై సిట్ ఛార్జ్ షీట్ దాఖలు చేయనుంది. ఈ కేసులో ఇప్పటికే వైసీపీ నేతల చెవిరెడ్డి భాస్కర్, MP మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసిన సిట్.. వారికి బెయిల్ రాకుండా అడ్డుకుంటోంది. ఉప రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలోనే MPకి మధ్యంతర బెయిల్ మంజూరైంది. మరోవైపు మోహిత్ రెడ్డి, మాజీ మంత్రి నారాయణ స్వామి, విజయానంద రెడ్డిపై సిట్ విచారణ చేపట్టింది. దీంతో వీరి భవితవ్యం ఏంటన్న చర్చ జోరుగా సాగుతోంది.

News September 10, 2025

తురకపాలెం వరుస మరణాలపై అధ్యయనం: సత్యకుమార్

image

AP: గుంటూరు జిల్లా తురకపాలెంలో వరుస మరణాలపై ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అన్ని రకాల పరీక్షలు నిర్వహించి కారణాలు తెలుసుకుంటామన్నారు. ‘ఐసీఏఆర్ టీమ్ ఇక్కడ పర్యటించింది. ఇప్పటికే మట్టి, తాగునీటి శాంపిల్స్ సేకరించింది. ఇందుకు సంబంధించిన ప్రాథమిక నివేదిక ఇవాళ వస్తుంది. అలాగే నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ టీమ్ కూడా గుంటూరుకు వస్తోంది’ అని ఆయన తెలిపారు.

News September 10, 2025

అన్నమయ్య: ఒక్కకాల్.. దళారుల పని ఫట్

image

సెప్టెంబర్ 10వ తేదీ నుంచి టాప్ గ్రేడ్ బొప్పాయి ఎగుమతి ధర కిలోకు రూ.8గా, సెకండ్ గ్రేడ్ బొప్పాయి కిలోకు రూ.7గా నిర్ణయించినట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి మంగళవారం వెల్లడించారు. మార్కెట్‌లో ఎవరైనా ట్రేడర్లు తక్కువ ధరకు విక్రయిస్తే, వెంటనే కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలని రైతులకు సూచించారు. సంప్రదించాల్సిన నంబర్లు 9573990331, 9030315951. ఈ నంబర్లకు కాల్ చేస్తే దళారుల పనిపడతామని కలెక్టర్ అన్నారు.