News September 10, 2025

నేడు అనంతపురానికి డిప్యూటీ CM.. షెడ్యూల్ ఇదే!

image

★ బుధవారం ఉ.11.30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి విమానంలో పుట్టపర్తికి బయలుదేరుతారు.
★ మ.12.30కి పుట్టపర్తి విమానాశ్రయం చేరుకుంటారు.
★ మ.12.40కి హెలికాప్టర్‌లో అనంతపురానికి బయలుదేరుతారు.
★ మ.1.00కి అనంతపురానికి చేరుకుంటారు.
★ మ.2-సా.4.30 వరకు ఇంద్రప్రస్థ మైదానంలో జరిగే ‘సూపర్6-సూపర్ హిట్’ సభలో పాల్గొని ప్రసంగం
★ సభ ముగిశాక పుట్టపర్తి విమానాశ్రయానికి వెళ్లి అక్కడి నుంచి మంగళగిరికి వెళ్తారు.

Similar News

News September 10, 2025

లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు

image

స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో ప్రారంభం అయ్యాయి. సెన్సెక్స్ 390 పాయింట్లు లాభపడి 81,489 వద్ద, నిఫ్టీ 118 పాయింట్లు వృద్ధి చెంది 24,990 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. HCL టెక్, TCS, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, బెల్, L&T, కొటక్ బ్యాంక్, యాక్సిస్, అదానీ పోర్ట్స్ షేర్లు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. సన్ ఫార్మా, మారుతీ, మహీంద్రా అండ్ మహీంద్రా, టైటాన్, ఎటర్నల్, టాటా మోటార్స్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

News September 10, 2025

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

image

బంగారం ధరలు క్రమంగా పెరుగుతూ ఆల్ టైమ్ రికార్డుకు చేరుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.219 పెరిగి రూ.1,10,509కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10g గోల్డ్ రూ.200 ఎగబాకి రూ.1,01,300 పలుకుతోంది. అటు KG వెండి ధర రూ.1,40,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News September 10, 2025

కాకినాడ: గ్రామాల్లో మొదలైన ఎన్నికల హడావిడి

image

2026 జనవరిలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. తొలిగా పంచాయతీ ఎన్నికలు జరగనుండటంతో గ్రామాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. సర్పంచ్ పదవులకు పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులు తమ ప్రయత్నాలను ప్రారంభించారు. కాకినాడ జిల్లాలో మొత్తం 21 మండలాల పరిధిలో 385 గ్రామ పంచాయతీలు, 4,328 వార్డులు, 430 ఎంపీటీసీ, 20 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి.