News September 10, 2025
అనకాపల్లి: ‘పాడైపోయిన ఐరన్ వస్తువులకు వేలం’

పాడైపోయిన ఐరన్ వస్తువులకు విశాఖ కైలాసగిరి ఆర్ముడ్ రిజర్వ్ హెడ్ క్వార్టర్స్‌లో ఈనెల 11న ఉదయం 10 గంటలకు వేలంపాట నిర్వహించనున్నట్లు అనకాపల్లి ఎస్పీ తుహీన్ సిన్హా తెలిపారు. వేలం పాటలో పాల్గొనేవారు ఆధార్ కార్డు జిరాక్స్‌తో పాటు రూ.500 డిపాజిట్ చెల్లించాలన్నారు. వేలం పాటను ఖరారు చేసుకున్నవారు అక్కడికక్కడే నగదు చెల్లించాలన్నారు. దీనికి 18 శాతం జీఎస్టీతో పాటు 12% ఇతర ఛార్జీలు అదనంగా చెల్లించాలన్నారు.
Similar News
News September 10, 2025
SDPT: స్థానిక ఎన్నికలు.. ఆశావాహుల్లో ఖర్చుల బుగులు

స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో పోటీ చేసే ఆశావాహుల్లో ఖర్చుల బుగులు పట్టుకుంది. కొన్ని గ్రామాల్లో ఆశావాహులు స్థానికులను మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. కొందరు ఎన్నికల తేదీ రాకముందే ఇప్పటినుండే ఖర్చు చేస్తే ఎలా అని సందిగ్ధంలో పడ్డారు. బీసీ రిజర్వేషన్లు తేలాకే స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం ముగ్గు చూపడంతో ఎన్నికల ఆలస్యం ఆశావాహులను కలవరపెట్టింది.
News September 10, 2025
దగదర్తి ఎయిర్ పోర్ట్‌కు రూ.916Cr తో టెండర్ల ఆహ్వానం

దగదర్తి ఎయిర్ పోర్ట్ నిర్మాణంలో కదలిక వచ్చింది. మొదటి దశ పనులను PPP విధానంలో చేపట్టేందుకు ఏపీఏడీసీఎల్ అంతర్జాతీయ టెండర్‌ను ఆహ్వానించింది. దీని కోసం నవంబర్ 10న ఫ్రీ బిడ్ కాన్ఫరెన్స్‌ను నిర్వహించనుంది. ఈ నిర్మాణానికి 2016లోనే TDP ప్రభుత్వం 13 వందల ఎకరాలతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు సైతం రావడంతో ఉమ్మడి చిత్తూరు, కడప, నెల్లూరు వాసులకు అన్నీ విధాలా లబ్ధి చేకూరనుంది.
News September 10, 2025
అమ్మాయిలకి ఈ టెస్టులు చేయించండి..

ఆడపిల్లలున్న తల్లిదండ్రులు వారు రజస్వల అయినప్పటి నుంచి వారికి కొన్ని ఆరోగ్య పరీక్షలు కచ్చితంగా చేయించాలంటున్నారు నిపుణులు. రక్తహీనత సమస్యను గుర్తించడానికి కంప్లీట్ బ్లడ్ కౌంట్(సీబీసీ) పరీక్ష, హార్మోన్ల అసమతుల్యతను గుర్తించడానికి థైరాయిడ్, హార్మోన్ల పరీక్షలు, విటమిన్‌ప్రొఫైల్ టెస్ట్, ఏవైనా మూత్ర సంబంధిత సమస్యలుంటే మూత్ర పరీక్ష చేయించాలి. వీటివల్ల ఏవైనా సమస్యలుంటే ముందుగానే గుర్తించే వీలుంటుంది.