News September 10, 2025
కర్మన్‌ఘాట్ గుడి పులిహోర వివాదం.. EO వివరణ

కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయంలో కుళ్లిన <<17658707>>పులిహోర ప్రసాదం<<>> పంపిణీ అయిందన్న వార్తల్లో నిజం లేదని ఆలయ EO లావణ్య స్పష్టం చేశారు. రోజూ ప్రసాదం తయారు చేసి అందజేస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ నిల్వ చేయబోమని తెలిపారు. కొంతమంది కావాలనే ఆలయ ప్రతిష్ఠను, భక్తుల మనోభావాలను దెబ్బతీయాలన్న ఉద్దేశంతోనే దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. దీనిపై కమిటీ విచారణ చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News September 10, 2025
లివర్ బాధితులకు నిమ్స్ భరోసా.. త్వరలో అత్యాధునిక చికిత్స

కాలేయ వ్యాధితో బాధపడుతున్న వారికి నిమ్స్ ఆస్పత్రి భరోసా ఇస్తోంది. త్వరలో అత్యాధునిక ఇంజెక్షన్‌ను అందుబాటులోకి రానుంది. అక్టోబర్ 2 నుంచి ఇది పేషెంట్లకు అందుబాటులో ఉంటుందని నిమ్స్ డైరెక్టర్ నగరి బీరప్ప తెలిపారు. ఎటువంటి సర్జరీ అవసరం లేకుండా కేవలం రీజనరేటివ్ మెడిసిన్‌తో లివర్ పనితీరును మెరుగుపరచవచ్చని డైరెక్టర్ తెలిపారు.
News September 10, 2025
ఇకపై ఓయూ విద్యార్థులకు ఏఐ, ఎంఎల్ నైపుణ్యాలు

ఓయూ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులకు AI, మిషన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్ రంగాలలో నైపుణ్యాలు పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు ఏఐ లింక్ టెక్నాలజీస్ సంస్థతో ఓయూ ఇంజినీరింగ్ కళాశాల అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. విద్యార్థులను అత్యాధునిక నైపుణ్యాలతో నిపుణులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఇరువర్గాలు ఒప్పందంపై సంతకాలు చేశారు. JNTUHలో ఇప్పటికే ఈ పద్ధతిలో బోధిస్తున్నారు.
News September 10, 2025
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో క్యాన్సర్ కేర్ సెంటర్

మంత్రి దామోదర్ రాజనర్సింహ వర్చువల్‌గా 33 జిల్లాల ప్రభుత్వ ఆస్పత్రుల్లో డే కేర్ క్యాన్సర్ సెంటర్లను ప్రారంభించారు. ఇందులో భాగంగా గాంధీ ఆస్పత్రిలో పాలియేటివ్ కేర్ సెంటర్ ఓపెనింగ్ కార్యక్రమం వర్చువల్‌గా జరిగింది. సూపరింటెండెంట్ డా.రాజకుమారి, ప్రిన్సిపల్ డా.ఇందిర, డిప్యూటీ సూపరింటెండెంట్ డా.సునీల్, RMO డా.శేషాద్రి, వైస్ ప్రిన్సిపల్ డా.రవిశేఖర్ రావు పాల్గొన్నారు.