News September 10, 2025
‘ఇందిరమ్మ ఇళ్ల’ ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబర్

TG: ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించేందుకు ప్రభుత్వం కాల్ సెంటర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. HYD హిమాయత్‌నగర్‌లోని హౌసింగ్ కార్పొరేషన్ హెడ్ ఆఫీసులో ఏర్పాటు చేసిన ఈ కాల్ సెంటర్‌ను ఇవాళ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించనున్నారు. 18005995991 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా లబ్ధిదారులు, ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరిస్తారు.
Similar News
News March 6, 2026
దూసుకెళ్తున్న బాలెన్ షా పార్టీ

నేపాల్ పార్లమెంట్ ఎన్నికల <<19309327>>ఫలితాల్లో<<>> రాష్ట్రీయ స్వతంత్రత పార్టీ(RSP) దూసుకెళ్తోంది. 68 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. ప్రత్యర్థులు దీనికి దరిదాపుల్లో కూడా లేరు. మాజీ PM కేపీ ఓలీ పార్టీ 5 సీట్లతో మూడో స్థానానికి పడిపోయింది. గగన్ కుమార్ థాపా నేతృత్వంలోని నేపాలీ కాంగ్రెస్ 9 స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతోంది. దీన్ని బట్టి బాలెన్ షాకు చెందిన RSP ఫుల్ మెజార్టీతో అధికారం చేపట్టనున్నట్లు స్పష్టమవుతోంది.
News March 6, 2026
10 రోజులు కరెంట్ కోతలు.. ఎందుకంటే?

TG: రాష్ట్రంలో రాబోయే 10 రోజులు గృహ అవసరాలకు షెడ్యూల్ చేయని కరెంట్ కోతలు ఉంటాయని తెలుస్తోంది. విద్యుత్ డిమాండ్ పెరగడంతో హైదరాబాద్‌తో సహా అనేక చోట్ల పవర్ సప్లై పరికరాలు ఓవర్‌లోడ్‌ను ఎదుర్కొంటున్నాయి. దీంతో అధికారులు నిర్వహణ పనులు చేపట్టారు. ఈ పనుల పూర్తికి కనీసం వారం పట్టనుంది. గ్రామాల్లోనూ పాత ట్రాన్స్‌ఫార్మర్‌లను మారుస్తున్నారు. డిమాండ్‌కు తగ్గట్లు విద్యుత్ ఉత్పత్తి చేస్తామని అధికారులు తెలిపారు.
News March 6, 2026
రేపు 11:01AMకి ‘ధురంధర్-2’ ట్రైలర్

ఆదిత్య ధర్, రణ్‌వీర్ సింగ్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘ధురంధర్-2’ సినిమా ట్రైలర్ రేపు ఉదయం 11.01 గంటలకు విడుదల కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ ప్రకటించారు. ఈసారి హిందీలోనే కాకుండా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సినిమా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలవనుంది. కాగా ‘ధురంధర్’ తొలి పార్ట్ ఏకంగా రూ.1,350 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే.


