News September 10, 2025

12న సిద్దిపేట IT టవర్‌లో ఇంటర్వ్యూలు

image

సిద్దిపేట IT టవర్‌లో ఈ నెల 12 నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్టు ఇన్‌ఛార్జ్ నరేందర్ గౌడ్ తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ కంపెనీ భారత్ బయోటెక్, TASK ఆధ్వర్యంలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్టు చెప్పారు. అభ్యర్థులు 2024-25లో BSCలో 50% మార్కులతో డిగ్రీ ఉత్తిర్ణత ఉండాలన్నారు. ITI, డిప్లొమా వారికి అవకాశాలు ఉన్నాయన్నారు. https://forms.gle/eVZEvHSnFTmD2UHB8లో రిజిస్టర్ చేసుకోవాలన్నారు.

Similar News

News March 21, 2026

భ‌ద్రాచలం దేవ‌స్ధానం అభివృద్దికి మాస్ట‌ర్ ప్లాన్‌

image

దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థాన అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి, కొండా సురేఖ‌, తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు వాకాటి శ్రీ‌హ‌రి అన్నారు. భద్రాద్రిని ఒక అంతర్జాతీయ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉందని వెల్లడించారు.

News March 21, 2026

NGKL: దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వు.. పులుల సంఖ్య ఇదే..!

image

తెలంగాణలోని నల్లమల అడవులు వన్యప్రాణులతో కళకళలాడుతున్నాయి. దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వుల్లో ఒకటైన అమ్రాబాద్ (ఏటీఆర్‌)లో పెద్ద పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. 2018లో 12 పులులు ఉండగా, 2024-25 నాటికి 36కు చేరింది. ఇక్కడ సుమారు 200 పులులు స్వేచ్ఛగా తిరిగేందుకు అనువైన వాతావరణం ఉంది. జంతువుల వేటను అరికట్టేందుకు రేడియో ఫ్రీక్వెన్సీతో పనిచేసే ఆధునిక కెమెరాలతో నిఘా పెంచారు. నేడు ప్రపంచ అటవీ దినోత్సవం.

News March 21, 2026

నేడు సాలార్జంగ్ మ్యూజియం బంద్

image

సాలార్జంగ్ మ్యూజియానికి వెళదాం అని రేపు బయలుదేరేరు.. అక్కడికి వెళ్లిన తరువాత మీకు నిరాశే ఎదురవుతుంది. ఎందుకంటే నేడు మ్యూజియానికి సెలవు కాబట్టి. రంజాన్ సందర్భంగా ఈనెల శనివారం మ్యూజియానికి సెలవు ప్రకటించారు. నగర ప్రజలు ఈ విషయం గమనించాలని క్యూరేటర్ డాక్టర్ రమావత్ బిక్షా నాయక్ తెలిపారు. ఇదిలా ఉండగా ఈ రోజు కూడా సెలవు. కాగా, ప్రతి శుక్రవారం సెలవు మ్యూజియానికి సెలవు ఉంటుంది.