News September 10, 2025

మద్దతు ధర రూ.10 కోట్లు మంజూరు: కలెక్టర్

image

అర్లీ ఖరీఫ్‌లో పండించిన ఉల్లి రైతులకు రూ.1,200 మద్దతు ధర చెల్లించేందుకు ప్రభుత్వం రూ.10 కోట్లు మంజూరు చేసిందని కలెక్టర్ పి.రంజిత్ బాషా తెలిపారు. మంగళవారం ఉల్లి కొనుగోళ్ల అంశానికి సంబంధించి కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి కొనుగోళ్ల కమిటీ సమావేశం టెలి కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. రైతుల నుంచి ఆధార్, బ్యాంకు అకౌంట్ తదితర వివరాలను తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

Similar News

News September 10, 2025

దేవనకొండలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

image

దేవనకొండ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ రంజిత్ బాషా ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని వైద్యులకు కలెక్టర్ సూచించారు. అనంతరం మండలంలోని మన గ్రోమోర్, యూరియా షాపుల్లో సోదాలు చేశారు.ఆయా షాపుల్లో యూరియా పంపిణీ రిజిస్టర్‌ను ఆయన పరిశీలించారు.

News September 10, 2025

కర్నూలులో హత్య.. మరో ఇద్దరి అరెస్ట్

image

కర్నూలు 1 టౌన్ పీఎస్ పరిధిలో జరిగిన హత్య కేసులో మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. సీఐ పార్థసారథి వివరాల మేరకు.. నిందితులు షేక్ ఇమ్రాన్(37), షేక్ యూసుఫ్(22)ను రాఘవేంద్ర ఘాట్ వద్ద పట్టుకొని, నేరానికి ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు అరెస్టయ్యారు. మొత్తం ఐదుగురు కలిసి షేక్ ఇజహర్ అహ్మద్‌పై దాడి చేసి, హత్య చేసినట్లు వెల్లడైంది.

News September 9, 2025

స్కూల్ గేమ్స్ అండర్ 19 షెడ్యూల్ విడుదల

image

కర్నూలు జిల్లా స్కూల్ గేమ్స్ అండర్ 19 బాల బాలికల ఎంపిక పోటీల షెడ్యూల్‌ను జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ రాఘవేంద్ర సోమవారం విడుదల చేశారు. DSA అవుట్ డోర్ స్టేడియంలో 10వ తేదీ ఆర్చరీ, ఘాట్కా, సెపక్ తక్ర 11న ఎమ్మిగనూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫుట్ బాల్, DSAలో 12న ఫెన్సింగ్, కురాశ్ , ఉషూ 13న సైక్లింగ్, కరాటే, మాల్కంబ్‌తోపాటు మరికొన్ని అంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.