News September 10, 2025
నేడే ‘సూపర్ సిక్స్ – సూపర్ హిట్’

AP: సూపర్ సిక్స్ హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంలోని TDP, JSP, BJP తొలిసారి భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాయి. ఇవాళ అనంతపురంలో ‘సూపర్ సిక్స్-సూపర్ హిట్’ పేరిట కార్యక్రమం జరగనుంది. CM చంద్రబాబు, Dy.CM పవన్, BJP రాష్ట్రాధ్యక్షుడు మాధవ్ సహా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. 15 నెలల్లో రాష్ట్రంలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించనున్నారు.
Similar News
News September 10, 2025
సూపర్-6 అట్టర్ ఫ్లాప్: వైసీపీ

AP: దీపం పథకం కింద ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితమంటూ ఇచ్చిన మాటను కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసిందని వైసీపీ విమర్శించింది. మొదటి ఏడాది ఒక సిలిండర్ ఇచ్చి మమ అనిపించిందని, మిగతావి ఇప్పటి వరకు అతీగతీ లేవని దుయ్యబట్టింది. ఇప్పుడు ఆ పథకం ఉందో లేదో కూడా ఎవరికీ తెలియదని ఎద్దేవా చేసింది. ప్రజలను మోసగించి విజయోత్సవాలు చేసుకునేందుకు సిగ్గుండాలని మండిపడింది.
News September 10, 2025
వారసుడితో నాగబాబు ఫ్యామిలీ

వరుణ్-లావణ్య జోడీ మగబిడ్డకు జన్మనివ్వడంతో నాగబాబు కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంది. మనవడి రాకతో తమ కుటుంబ భవిష్యత్తుకు సరికొత్త కాంతి వచ్చిందని నాగబాబు ట్వీట్ చేశారు. ‘సింహం కూనకు స్వాగతం. నీవు నా హృదయంలో గర్జించావు. నీ చేతిని పట్టుకొని నడిచేందుకు సిద్ధంగా ఉన్నాను’ అని రాసుకొచ్చారు. కుటుంబంతో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేశారు.
News September 10, 2025
సబిత, సునీత కాంగ్రెస్‌లో చేరట్లేదు: బీఆర్ఎస్ నేత కార్తీక్

TG: బీఆర్ఎస్ MLAలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి కాంగ్రెస్‌లో చేరబోతున్నారనే ప్రచారంలో వాస్తవం లేదని సబిత కుమారుడు, బీఆర్ఎస్ నేత కార్తీక్ స్పష్టతనిచ్చారు. ఇంతకాలం ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని తాము పట్టించుకోలేదని, కానీ ఇకపై ఉపేక్షించబోమని తేల్చి చెప్పారు. ఇలాంటి వార్తలను ప్రచురించే వారికి(యూట్యూబ్ ఛానెల్స్) లీగల్ నోటీసులు ఇస్తామని, వాళ్లు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని హెచ్చరించారు.