News September 10, 2025
జగిత్యాల: SEPT 13న జాతీయ మెగా లోక్ అదాలత్

ఈనెల 13న జాతీయ మెగా లోక్ అదాలత్ అన్ని కోర్టు ప్రాంగణాల్లో జరుగుతుందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. క్రిమినల్, కంపౌండబుల్, సివిల్ తగాదా, ఆస్తి విభజన, కుటుంబపరమైన నిర్వహణ, వైవాహిక జీవితం, బ్యాంకు రికవరీ, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్, డ్రంక్ అండ్ డ్రైవ్, పెట్టీ కేసులు, ఇతర రాజీ పడే కేసుల్లో కక్షిదారులు ఈ కార్యక్రమం ద్వారా రాజీకి రావాలని సూచించారు. రాజీ మార్గం రాజ మార్గమన్నారు.
Similar News
News September 10, 2025
BHPL: ‘చాకలి ఐలమ్మ జీవితం నేటి తరాలకు ఆదర్శం’

సమాజంలో అన్యాయం, అణచివేతలకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ స్ఫూర్తిదాయక జీవితం నేటి తరాలకు మార్గదర్శకమని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పేర్కొన్నారు. చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి సందర్భంగా ఐడిఓసిలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి, ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
News September 10, 2025
BHPL: ‘జాతీయ లోక్-అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి’

సెప్టెంబర్ 13న జరగనున్న జాతీయ లోక్-అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ఒక ప్రకటనలో తెలిపారు. ‘రాజీ మార్గమే.. రాజ మార్గం. రాజీపడడానికి అవకాశం ఉన్న అన్ని కేసులలో కక్షిదారులు రాజీ పడవచ్చు’ అని జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే పేర్కొన్నారు. క్షణికావేశంలో చేసే తప్పులను సరిదిద్దుకోవాడానికి లోక్-అదాలత్ అనేది ఒక మంచి అవకాశం అని, అనవసర గొడవలకు పోయి జీవితాలను ఇబ్బందులపాలు చేసుకోకూడదని అన్నారు.
News September 10, 2025
జనగామ పురపాలక సంఘం కార్యాలయంలో ఐలమ్మ వర్ధంతి

జనగామ పురపాలక సంఘ కార్యాలయంలో కమిషనర్ మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి కమిషనర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కమిషనర్ మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగ సాయుధ భూ పోరాటంలో వెట్టి చాకిరి, విముక్తి కోసం దొరలను గడగడలాడించిన వీర వనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు. మున్సిపల్ అధికారులు రాములు, గోపయ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.