News September 10, 2025
జగిత్యాల: కాళోజీ రచనలు సమానత్వాన్ని ప్రతిబింబించాయి

జగిత్యాల జిల్లా సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంలో మంగళవారం కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రజాకవి కాళోజీ సేవలు, తెలంగాణ ఉద్యమానికి ఆయన చేసిన కృషి, రచనలు, తెలంగాణ సంస్కృతి, స్వేచ్ఛ, సమానత్వాన్ని ప్రతిబింబించాయని కలెక్టర్ అన్నారు.
Similar News
News September 10, 2025
ఓదెల ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్: ఎమ్మెల్యే

నెల రోజుల్లోగా ఓదెల ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించనున్నట్లు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు పేర్కొన్నారు. బుధవారం కలెక్టర్ శ్రీహర్షతో కలిసి ఓదెల ఆలయంలో పూజలు చేశారు. అనంతరం ఆలయ పరిసరాలు పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆలయ పరిధిలో 500 మీటర్లలోపు రియల్ ఎస్టేట్ వ్యాపారం నిషేధమని పేర్కొన్నారు. ఆలయ పాలకమండలితో ఆలయ అభివృద్ధిపై చర్చించారు. అధికారులు, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.
News September 10, 2025
సూపర్-6 అట్టర్ ఫ్లాప్: వైసీపీ

AP: దీపం పథకం కింద ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితమంటూ ఇచ్చిన మాటను కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసిందని వైసీపీ విమర్శించింది. మొదటి ఏడాది ఒక సిలిండర్ ఇచ్చి మమ అనిపించిందని, మిగతావి ఇప్పటి వరకు అతీగతీ లేవని దుయ్యబట్టింది. ఇప్పుడు ఆ పథకం ఉందో లేదో కూడా ఎవరికీ తెలియదని ఎద్దేవా చేసింది. ప్రజలను మోసగించి విజయోత్సవాలు చేసుకునేందుకు సిగ్గుండాలని మండిపడింది.
News September 10, 2025
పనులు పెండింగ్‌లో ఉంటే చర్యలు తప్పవు: కలెక్టర్

జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన డాక్యుమెంట్లను తప్పనిసరిగా EPTS పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు. బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి అధికారులతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న రికార్డులను వెంటనే అప్‌లోడ్ చేయాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.