News September 10, 2025

ప్రకాశం: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్

image

ప్రకాశం జిల్లా దొనకొండ వాసులకు MP మాగుంట శ్రీనివాసులరెడ్డి శుభవార్త చెప్పారు. ఇకపై దొనకొండ రైల్వే స్టేషన్‌లో 3 ప్రధాన రైళ్లు ఆగనున్నాయి. గత నెలలో రైల్వే GMకు MP మాగుంట దొనకొండ, కురిచేడులలో పలు రైళ్లు నిలుపుదల చేయాలని కోరారు. ఈ మేరకు రైల్వే అధికారులు దొనకొండలో అమరావతి ఎక్స్‌ప్రెస్, యశ్వంత్‌పూర్, వాస్కోడిగామా, ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లను నిలుపుదల చేస్తున్నట్లు మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది.

Similar News

News March 26, 2026

మార్కాపురం: బస్సు రూట్ మార్చారా..?

image

మార్కాపురం(M) రాయవరం వద్ద ప్రమాదానికి గురైన బస్సు రూట్ మారిందనే అనుమానాలు వస్తున్నాయి. జగిత్యాల నుంచి బయల్దేరిన ఈ బస్సు.. వినుకొండ, పొదిలి మీదుగా కనిగిరి చేరుకోవాల్సి ఉంది. దీనికి భిన్నంగా యర్రగొండపాలెం, మార్కాపురం మీదుగా ఎందుకు వచ్చింది అనేది తెలియాల్సి ఉంది. వినుకొండలో సైతం ముగ్గురు ప్రయాణికులు దిగాల్సి ఉంది.

News March 26, 2026

మార్కాపురం ప్రమాదం.. ఒకే ఇంట్లో ఇద్దరి మృతి

image

మార్కాపురం జిల్లా రాయవరం బస్సు ప్రమాదంలో కనిగిరి మండలం చల్లగిరిగల గ్రామానికి చెందిన ఇద్దరు చనిపోయారు. బీసీ కాలనీకి చెందిన తమ్మిశెట్టి పిచ్చమ్మ(80), ఆమె మనమరాలు తమ్మిశెట్టి రుక్మిణి(22), రుక్మిణి భర్త తిరుపాలు బస్సులో బయల్దేరారు. యాక్సిడెంట్ జరిగి మంటలు చెలరేగడంతో పిచ్చమ్మ, రుక్మిణి చనిపోయారు. తిరుపాలు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

News March 26, 2026

మార్కాపురం: అయ్యో పాపం..!

image

మార్కాపురం జిల్లా రాయవరం వద్ద జరిగిన బస్సు ప్రమాదం ఓ అందమైన కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. కొనకనమిట్ల మండలం పెదారికట్లకు చెందిన అంబటి అనిల్ తన భార్య సౌజన్య, 5నెలల కుమారుడితో స్వగ్రామానికి బయల్దేరారు. మంటలు చెలరేగి అనిల్, కుమారుడు చనిపోయారు. సౌజన్య ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. లోకం చూడని చిన్నారి మంటల్లో కాలిపోవడం కంటతడి పెట్టిస్తోంది. దేవుడా.. ఈ ఘోరం ఏ ఇంట్లోనూ జరగకూడదని విలపించారు.