News September 10, 2025

4వేల ఎకరాలు గుర్తించండి: కలెక్టర్

image

రంపచోడవరం PMRC కార్యాలయంలో తహశీల్దార్‌లతో జిల్లా కలెక్టర్ మంగళవారం సమావేశం నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు వలన చింతూరు డివిజన్‌లో భూములు కోల్పోతున్న రైతులకు అడ్డతీగల, రాజవొమ్మంగి మండలాల్లో భూములు అందజేయాలన్నారు. కేసుల్లో లేని, వివాదాలు లేని 4,000 ఎకరాలను గుర్తించి నివేదిక 15రోజుల్లో అందజేయాలని తహశీల్దార్‌లను ఆదేశించారు. సబ్ కలెక్టర్ శుభం నొక్వాల్ ఉన్నారు.

Similar News

News September 10, 2025

ఈనెల 23 నుంచి సింహాచలంలో శరన్నవరాత్రులు

image

సింహాచలంలో శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామి వారి దేవస్థానంలో శరన్నవరాత్ర ఉత్సవములు ఈనెల 23 నుంచి అక్టోబర్ 1 వరకు జరుగనున్నాయిని ఈ.ఓ వేండ్ర త్రినాథరావు బుధవారం తెలిపారు. ప్రతిరోజూ విశేష ఉత్సవములు, రామాయణ పారాయణం, సాయంత్రం బేడా తిరువీధి ఉత్సవాలు జరుగుతాయన్నారు. OCT 02న విజయదశమి సందర్భంగా శమీపూజ మహోత్సవం, పూలతోటలో జమ్మి వేటతో జరుగుతాయన్నారు. అదే రోజు సాయంత్రం 6 గంటలకు దర్శనం కల్పిస్తామన్నారు.

News September 10, 2025

కడప మేయర్ సురేశ్ బాబుకు మరోసారి నోటీసులు

image

కడప నగరపాలక సంస్థ మేయర్ సురేశ్ బాబుకు మరోసారి నోటీసులు జారీ అయ్యాయి. ఈ నెల 17న హాజరుకావాలని ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేశ్ కుమార్ నోటీసులు పంపారు. ఇదే చివరి అవకాశం అంటూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తమ కుటుంబ సభ్యులకు చెందిన సంస్థలకు కాంట్రాక్ట్ పనులు మంజూరు చేసినట్లు వచ్చిన ఆరోపణల కారణంగా కోర్టు నోటీసులు జారీ చేసింది.

News September 10, 2025

ములుగు TASK రీజినల్ సెంటర్‌లో ఉచిత శిక్షణ

image

ములుగు టాస్క్ రీజినల్ సెంటర్‌‌లో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ అందించనున్నట్లు జిల్లా కేంద్ర మేనేజర్ మురళి కృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిక్షణలో జావా, పైథాన్, వెబ్ డెవలప్మెంట్, డేటాబేస్ (SQL), C, C++, HTML, CSS, JavaScript, Bootstrap వంటి కంప్యూటర్ కోర్సులు ఉంటాయన్నారు. విద్యార్థులు సెప్టెంబర్ 15, 16, 17 తేదీల్లో ములుగు TASK రీజినల్ సెంటర్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు.