News September 10, 2025
అన్నమయ్య: ఒక్కకాల్.. దళారుల పని ఫట్

సెప్టెంబర్ 10వ తేదీ నుంచి టాప్ గ్రేడ్ బొప్పాయి ఎగుమతి ధర కిలోకు రూ.8గా, సెకండ్ గ్రేడ్ బొప్పాయి కిలోకు రూ.7గా నిర్ణయించినట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి మంగళవారం వెల్లడించారు. మార్కెట్‌లో ఎవరైనా ట్రేడర్లు తక్కువ ధరకు విక్రయిస్తే, వెంటనే కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలని రైతులకు సూచించారు. సంప్రదించాల్సిన నంబర్లు 9573990331, 9030315951. ఈ నంబర్లకు కాల్ చేస్తే దళారుల పనిపడతామని కలెక్టర్ అన్నారు.
Similar News
News March 10, 2026
యాసిడ్ దాడి బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేరా?: SC

యాసిడ్ దాడి బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేలా పునరావాస పథకం ఎందుకు తీసుకురాలేదని రాష్ట్రాలు, UTలను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. వారికి ప్రభుత్వ నియంత్రణలో ఉన్న రంగాల్లో ఉపాధి కల్పించే పథకాన్ని రూపొందించాలని ఆదేశించింది. ఉద్యోగాలు ఇవ్వడంలో ఏవైనా సమస్యలుంటే జీవన భత్యం చెల్లించేలా పాలసీ తీసుకురావాలని సూచించింది. హరియాణాకు చెందిన ఓ యాసిడ్ బాధితురాలి కేసు విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది.
News March 10, 2026
చిత్తూరు: ఏడుగురు సర్వేయర్లకు షోకాజ్ నోటీసులు

ఏడుగురు గ్రామ సర్వేయర్లకు షోకాజ్ నోటీసులు జారీచేస్తూ జిల్లా సర్వే భూరికార్డుల శాఖ ఏడీ పుల్లయ్య ఉత్తర్వులు జారీచేశారు. తోటి సర్వేయర్లను విధులకు హాజరు కానీయకుండా చేశారనే కారణంతో సర్వేయర్ల యూనియన్ ఆఫీస్ బేరర్స్‌లోని నాయకులకు షోకాజ్ ఇచ్చారు. ఇదే వ్యవహారంలో గతంలో ముగ్గురు సర్వేయర్లను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
News March 10, 2026
లా, బీఈడీ కోర్సుల ఫీజులు ఖరారు

TG: రాష్ట్రంలోని ప్రైవేట్ కాలేజీల్లో లా, బీఈడీ కోర్సుల ఫీజులు ఖరారయ్యాయి. 3 ఏళ్ల LLB కోర్సుకు కనిష్ట ఫీజు ₹20వేలు, గరిష్టంగా ₹40,300, ఐదేళ్ల LLB కోర్సుకు ₹20 వేలు, ₹44,800గా ఫిక్స్ చేశారు. పీజీ లా కోర్సు ₹26,000, ₹50,400గా ఉంది. బీఈడీకి కనిష్టంగా ₹16,500, గరిష్ట ఫీజు ₹50,800, ఎంఈడీ కోర్సుకు ₹25వేలు, ₹45వేలుగా నిర్ణయించారు. 2027-28 అకడమిక్ ఇయర్ వరకు ఇవే ఫీజులు ఉండనున్నాయి.


