News September 10, 2025

TU: పీజీ రివాల్యుయేషన్‌కు ఈనెల 17 ఆఖరు

image

తెలంగాణ విశ్వవిద్యాలయం (తెవివి) పరిధిలోని 2021, 2022 ఇంటిగ్రేటెడ్ పీజీ పరీక్షల రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు గడువు ఈనెల 17వ తేదీ వరకు ఉందని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (సీఓఈ) ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. అప్లికేషన్లను ఈ నెల 18లోపు యూనివర్సిటీలో సమర్పించాలని విద్యార్థులకు సూచించారు. పూర్తి వివరాలకు తెవివి వెబ్‌సైట్‌ను సందర్శించగలరు.

Similar News

News March 5, 2026

MBNR: బిడ్డను ఉయ్యాలలో వదిలి.. అనంతలోకాలకు

image

అప్పుల బాధ ఆ పసిగుడ్డుకు తల్లిని దూరం చేసింది.. తండ్రిని మృత్యువుతో పోరాడేలా చేసింది. జంగమయ్యపల్లిలో చోటుచేసుకున్న <<19307113>>దంపతుల ఆత్మహత్యాయత్నం<<>> స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. అప్పులు తీర్చే మార్గం కనిపించక మురుగని దంపతులు తమ పొలంలో పసిబిడ్డను ఉయ్యాలలో వేసి, పక్కనే ఉన్న చెట్టుకు ఉరివేసుకున్నారు. చనిపోయే ముందు రవి తన తమ్ముడికి వీడియో కాల్‌ చేసి ‘మేము ఇక బతకలేం’ అని రోదించడం అందరినీ కలిచివేసింది.

News March 5, 2026

MBNR: ఆత్మహత్యాయత్నం.. భార్య మృతి, భర్త పరిస్థితి విషమం

image

నవాబుపేట(M) జంగమయ్యపల్లిలో అప్పుల ఊబిలో చిక్కుకున్న ఓ దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. గ్రామానికి చెందిన మురుగని రవి-లావణ్య దంపతులు తమ పొలంలో చెట్టుకు ఉరివేసుకున్నారు. చనిపోయే ముందు రవి HYDలోని తన తమ్ముడికి వీడియో కాల్ చేసి, తాము చనిపోతున్నామని తెలిపారు. ఈ ఘటనలో లావణ్య అక్కడికక్కడే మృతి చెందగా.. కొన ప్రాణంతో ఉన్న రవిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది.

News March 5, 2026

విరోష్ జంటకు సీఎం శుభాకాంక్షలు

image

TG: సీఎం రేవంత్ రెడ్డి నూతన దంపతులు రష్మిక-విజయ్ దేవరకొండను ఆశీర్వదించారు. రిసెప్షన్ సమయంలో ఢిల్లీలో ఉన్న సీఎం.. ఇవాళ విజయ్ నివాసానికి వెళ్లారు. కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారి ఫ్యామిలీతో కలిసి ఫొటో దిగారు.