News September 10, 2025
ఖమ్మం: కేయూలో ఎల్ఎల్‌బీ పరీక్షలు వాయిదా

కాకతీయ యూనివర్సిటీ (కేయూ) పరిధిలో ఈ నెల 12న జరగాల్సిన ఎల్ఎల్‌బీ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఎల్ఎల్‌బీ మూడేళ్ల కోర్సు రెండో సెమిస్టర్ (మూడో పేపర్), ఐదేళ్ల లా కోర్సు ఆరో సెమిస్టర్ (మూడో పేపర్) పరీక్షలను వాయిదా వేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కె.రాజేందర్ తెలిపారు. వాయిదా వేసిన ఈ పరీక్షలు ఈనెల 15న జరుగుతాయని చెప్పారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
Similar News
News March 4, 2026
దుబాయ్, ఖతర్‌లో అమెరికా లక్ష్యాలపై ఇరాన్ దాడులు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. దుబాయ్‌లోని US కాన్సులేట్ సమీపంలో ఇరాన్ డ్రోన్లతో దాడి చేసింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. మరోవైపు ఖతర్‌లోని అతిపెద్ద అమెరికా సైనిక స్థావరం అల్ ఉదైద్ లక్ష్యంగా ఇరాన్ 2 బాలిస్టిక్ మిస్సైల్స్‌ను ప్రయోగించింది. వీటిలో ఒకదాన్ని డిఫెన్స్ సిస్టమ్స్ అడ్డుకోగా రెండో క్షిపణి ఎయిర్ బేస్‌ను తాకింది. ఈ ఘటనల్లో ఆస్తి నష్టం సంభవించినా ప్రాణనష్టం జరగలేదు.
News March 4, 2026
కృష్ణా: మందుబాబులారా జాగ్రత్త.. లేబుళ్లు తీసేసి అమ్మేస్తున్నారు!

ఉమ్మడి కృష్ణా జిల్లాలో బెల్టుషాపుల్లో మద్యం విక్రయాలు జోరందుకున్నాయి. బార్లు, వైన్ షాప్స్ నుంచి లేబుళ్లు తొలగించి సరకు విక్రయిస్తున్నారు. లేబుళ్లను తొలగించడం వల్ల అది ఏ డిపో నుంచి వచ్చిందో కనిపెట్టడానికి ఆస్కారం ఉండదు. బెల్టుషాపుల్లో ఇతర రాష్ట్రాల సరకు కూడా విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కల్తీ మద్యం అయితే ప్రాణాలకే ముప్పు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవశ్యకత ఉంది.
News March 4, 2026
నంద్యాల: ఒకరి దుర్మరణం.. 10 మందికి గాయాలు

బనగానపల్లె(M) దద్దనాల చెరువు సమీపంలో నిన్న జరిగిన ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, 10 మంది గాయపడ్డారు. చిన్నరాజుపాలెం నుంచి పనులకు 15 మంది ఆటోలో తమ్మడపల్లెకు వెళ్లారు. సాయంత్రం స్వగ్రామానికి వస్తుండగా డ్రైవర్ మహేశ్ వేగంగా నడపడంతో అదుపు తప్పి బోల్తా పడింది. శేషమ్మ(55) అక్కడికక్కడే మృతిచెందారు. క్షతగాత్రులను బనగానపల్లె వైద్యశాలకు తరలించారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఘటన జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు.


