News September 10, 2025

నల్గొండ: ప్రాజెక్టులు పూర్తైతే పెరగనున్న సాగు విస్తీర్ణం

image

ఉమ్మడి NLG జిల్లా రైతులకు మహర్ధశ పట్టనుంది. మంగళవారం జిల్లాలోని సాగు నీటి ప్రాజెక్టులపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షించిన మంత్రి ఉత్తమ్ 2027 నాటికి అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. SLBC పూర్తైతే సుమారు 4 లక్షల ఎకరాలు, డిండి ఎత్తిపోతల కింద మూడున్నర లక్షల ఎకరాలు, బస్వాపూర్ కింద 23 వేల ఎకరాలు, మరికొన్ని ప్రాజెక్టులు కింద కలుపుకుని 8 లక్షల ఎకరాలకు పైనే సాగు విస్తీర్ణం పెరగనుంది.

Similar News

News March 5, 2026

కామారెడ్డి: కలెక్టర్‌ను కలిసిన ఈఈ అశోక్

image

తెలంగాణ రాష్ట్ర విద్యా సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (TGEWIDC) కామారెడ్డి జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా ఈఈ అశోక్ బాధ్యతలు స్వీకరించారు. గురువారం కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్‌కు పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో విద్యాసంస్థల మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులపై చర్చించారు.

News March 5, 2026

సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయం పేరు మార్పు

image

సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సర్దార్ జలగం వెంగళరావు పేరు పెట్టారు. వెంగళరావు పేరు పెట్టేందుకు కృషి చేసిన స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్‌లకు మున్సిపాలిటీ ప్రజలు, నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాగా, 1973 నుంచి 1978 వరకు ఉమ్మడి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ రాష్ట్ర అభివృద్ధికి దృఢమైన పునాదులు వేశారు.

News March 5, 2026

10 నిమిషాల్లో అంబులెన్స్ అందుబాటులో ఉండాలి: కలెక్టర్

image

రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు Arrive-Alive కార్యక్రమాన్ని ఏప్రిల్ 13 నుంచి 18 వరకు నిర్వహిస్తారని కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. గురువారం సమీకృత కలెక్టరేట్‌లో రోడ్డు భద్రతా ప్రమాణాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అత్యవసర పరిస్థితుల్లో 10 నిమిషాల్లో అంబులెన్స్ అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. అన్ని శాఖలు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని కలెక్టర్ ఆదేశించారు.