News September 10, 2025
KNR: SU LLB, LLM పరీక్షల ఫీజు నోటిఫికేషన్ విడుదల

SU పరిధిలో జరగనున్న LLB 4వ సెమిస్టర్, LLM 2వ, 4వ సెమిస్టర్ పరీక్షల ఫీజు నోటిఫికేషన్‌ను అధికారులు విడుదల చేశారు. దీని ప్రకారం అపరాధ రుసుము(లేట్ ఫీ) లేకుండా SEPT 18 వరకు, లేట్ ఫీజు రుసుము రూ.300తో SEPT 22 వరకు చెల్లించుకోవచ్చని శాతవాహన విశ్వవిద్యాలయ పరీక్షలు నియంత్రణాధికారి డా.సురేశ్ కుమార్ తెలిపారు. మరిన్ని వివరాలకు యూనివర్సిటీ వెబ్ సైట్‌ను లేదా ఆయా కళాశాలలను సంప్రదించవచ్చని సూచించారు.
Similar News
News March 5, 2026
HYD: చదువుకొనే పిల్లలనూ వదలడం లేదు!

JNTUHలో ప్రైవేటు సంస్థల జోక్యం వివాదానికి దారితీసింది. స్టూడెంట్స్‌కు క్రెడిట్ కార్డుల ఆశ చూపుతూ ECE డిపార్ట్‌మెంట్ వద్ద బ్యానర్లు ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. డైరెక్టర్ అనిత అనుమతితోనే తాము పెట్టామని సదరు సంస్థ ప్రతినిధులు తెలపడంపై విమర్శలొస్తున్నాయి. చదువుకొనే వయసులో క్రెడిట్ కార్డులు ఇచ్చి వారిని అప్పుల ఊబిలోకి నెట్టడమేంటని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. దీనిపై మీ కామెంట్?
News March 5, 2026
నెల్లూరు జిల్లాలో ఘోర విషాదం

వలేటివారిపాలెం మండలం పోలినేనిపాలెంలో బుధవారం విషాద ఘటన చోటుచేసుకుంది.గ్రామానికి చెందిన పాపారావు తన కుమారుడు శ్రీకాంత్‌తో కలిసి ఇప్పగుంట పొలాల్లో గొర్రెలు మేపుతున్నారు. కోనేరు కుంట వద్ద భోజనం చేసిన తాగునీటి కోసం బావిలోకి దిగిన శ్రీకాంత్ ప్రమాదవశాత్తు పడిపోయాడు. కుమారుడిని రక్షించేందుకు బావిలోకి దిగిన తండ్రి పాపారావు కూడా ప్రమాదానికి గురై ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.
News March 5, 2026
వికారాబాద్‌లో పెరిగిన క్రయవిక్రయాలు!

వికారాబాద్ జిల్లాలో భూములు ఫ్లాట్లు ఇతరత్రా క్రయవిక్రయాలు జోరందుకున్నాయి. దీంతో ప్రభుత్వానికి ఆదాయం చేకూరుతుంది. గతేడాది ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి నాటికి జిల్లాలో రూ.54.56 కోట్ల ఆదాయం సమకూరినట్లు అధికారులు చెబుతున్నారు. ఇందులో అత్యధికంగా వికారాబాద్‌లో రూ.27.59 కోట్ల ఆదాయం సమకూరగా అత్యల్పంగా కొడంగల్లో రూ.6.05 కోట్ల ఆదాయం సమకూరింది.


