News September 10, 2025

MHBD: క్యాన్సర్ కేర్ యూనిట్ ప్రారంభం

image

MHBD జనరల్ ఆసుపత్రిలో క్యాన్సర్ కేర్ యూనిట్ సేవలు మంగళవారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. ఆరోగ్య శాఖ మంత్రి రాజ నర్సింహ మంగళవారం వర్చువల్‌గా ప్రారంభించిన కార్యక్రమంలో జిల్లా వైద్య అధికారులు పాల్గొన్నారు. MNJ క్యాన్సర్ కేర్ హాస్పిటల్ సౌజన్యంతో జిల్లాలోని 160 మంది క్యాన్సర్ రోగులకు ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాన్సర్ సేవలు అందించనున్నారు.

Similar News

News September 10, 2025

VZM: ‘యూరియా మార్గమధ్యంలో ఉంది’

image

విజయనగరం జిల్లాలో ప్ర‌స్తుతం 200 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని కలెక్టర్ అంబేడ్కర్ చెప్పారు. బుధవారం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాకు ఐపీఎల్ కంపెనీ నుంచి కేటాయించిన 700 మెట్రిక్‌ టన్నులు మార్గ‌మ‌ధ్యంలో ఉంద‌ని, ఒకటి రెండు రోజుల్లో జిల్లాకు చేరునుందన్నారు. అదేవిధంగా రైలు మార్గం ద్వారా కాకినాడ నుంచి ఇంకొక 500 మెట్రిక్ టన్నులు 3 రోజుల్లో వస్తుందన్నారు.

News September 10, 2025

అక్టోబర్ నుంచి దేశవ్యాప్తంగా SIR!

image

ఓటర్ జాబితా రీవెరిఫికేషన్‌కు సంబంధించి బిహార్‌లో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(<<17634931>>SIR<<>>) త్వరలో దేశవ్యాప్తంగా జరగనున్నట్లు సమాచారం. OCT నుంచి ఈ ప్రక్రియ స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. ఇవాళ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్స్‌తో జరిగిన మీటింగ్‌లో ఎన్నికల సంఘం ఈ మేరకు నిర్ణయించినట్లు తెలిసింది. ఈ నెలలోనే గ్రౌండ్ వర్క్ పూర్తిచేస్తామని అధికారులు చెప్పినట్లు సమాచారం.

News September 10, 2025

NTR: వైద్యశాఖలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

image

NTR వైద్యసేవలో 48 డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ అధికారి(టెక్నికల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. APMC రిజిస్ట్రేషన్ కలిగి MBBS పూర్తి చేసినవారు ఈ పోస్టులకు అర్హులని, https://apmsrb.ap.gov.in/msrb/లో ఈ నెల 15లోపు దరఖాస్తు చేసుకోవాలని AP మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు మెంబర్ సెక్రటరీ M.V. సూర్యకళ తెలిపారు. దరఖాస్తు విధానం, వేతనం తదితర వివరాలకు పై వెబ్‌సైట్ చూడాలన్నారు.