News September 10, 2025

JGTL జిల్లా విద్యుత్ శాఖ ఇంజినీర్స్ కార్యవర్గం ఏకగ్రీవం

image

JGTL జిల్లా TG పవర్ డిప్లోమా ఇంజినీర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లాధ్యక్షుడిగా బీ.సుందర్, అడ్వైజర్‌గా యం.సదశివారెడ్డి, కార్యదర్శిగా పి.వరుణ్ కుమార్, కోశాధికారిగా ఎం.శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎల్.రాజు, ఆఫీసు సెక్రటరీగా ఎస్.రంజిత్, లేడీ రెప్రజెంటేటివ్‌గా ఎస్.మౌనిక ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో కంపెనీ జనరల్ సెక్రటరీ సుబ్రహ్మణేశ్వరరావు పాల్గొన్నారు.

Similar News

News March 18, 2026

కందుకూరు లేఅవుట్ పనులు జూన్‌ లోపు పూర్తి చేయాలి: జేసీ

image

అనంతపురం రూరల్ పరిధిలోని కందుకూరు అహుడా లేఅవుట్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను జేసీ విష్ణుచరణ్ పరిశీలించారు. డ్రైనేజీలు, రోడ్లు, అండర్‌ గ్రౌండ్ డ్రైనేజీ, నీటి సరఫరా, పార్క్ చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. జూన్ నెలలోపు అన్ని పనులు పూర్తి చేయాలని, పక్షం రోజులకు ఒకసారి పురోగతి నివేదిక సమర్పించాలని సూచించారు. కార్యక్రమంలో అహుడా అధికారులు పాల్గొన్నారు.

News March 18, 2026

బాపట్ల: ఇంటర్ పరీక్షకు 154 మంది గైర్హాజరు

image

బాపట్ల జిల్లాలో బుధవారం నిర్వహించిన ఇంటర్ పరీక్షకు 154 మంది గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి జుబేర్ పేర్కొన్నారు. బుధవారం ఇంటర్ పరీక్షకు 7,670 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 7,516 మంది మాత్రమే హాజరయ్యారన్నారు మిగిలిన 154 మంది పరీక్షకు హాజరు కాలేదన్నారు. జిల్లాలో బుధవారం నాడు ఇంటర్ పరీక్ష ఎటువంటి కాపీయింగ్ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా ముగిసిందన్నారు.

News March 18, 2026

కామారెడ్డిలో ఎక్సైజ్ దాడులు.. అల్ఫాజోలం స్వాధీనం

image

కామారెడ్డి జిల్లాలో ఎక్సైజ్ అధికారులు బుధవారం ప్రత్యేక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అక్రమంగా ఆల్ఫాజోలం నిల్వ ఉంచిన వ్యక్తులను పట్టుకుని సుమారు 220 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆల్ఫాజోలం, రవాణా చేస్తున్న వారిపై కేసులు నమోదు చేసి 110 గ్రాముల అల్పోజోలం , 106 గ్రాముల ఆల్ఫాజోలం స్వాగతం చేసుకున్నారు. మొత్తం 4 కేసులు నమోదు చేసి, నిందితులపై NDPS చట్టం కింద చర్యలు తీసుకున్నారు.