News September 10, 2025

నక్కపల్లి స్టీల్ ప్లాంట్ ఏపీకి గర్వకారణం: శ్రీనివాసవర్మ

image

నక్కపల్లిలో ఏర్పాటు చేయబోయే ఆర్సెలాల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏపీకి గర్వకారణంగా కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి బి.శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. మంగళవారం ఢిల్లీలో మంత్రి కార్యాలయంలో మాట్లాడుతూ.. 17.8 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో దీనిని నిర్మిస్తున్నట్లు తెలిపారు. మొదటి దశలో 7.3 మిలియన్ టన్నులు, రెండవ దశలో 10.5 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్ధ్యంతో పూర్తి చేస్తామన్నారు.

Similar News

News September 10, 2025

నార్నూర్ కేజీబీవీని సందర్శించిన సబ్ కలెక్టర్

image

నార్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్ బుధవారం సందర్శించారు. ఈ పాఠశాలలో ఉదయం విద్యార్థినుల భోజనంలో పురుగులు ఉన్నాయని ఆరోపణలు రాగా ఆయన ఈ ఘటనపై ఆరా తీశారు. పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సబ్ కలెక్టర్ హామీ ఇచ్చారు. ఆయనతో పాటు విద్యాధికారి పవార్ అనిత, తహశీల్దార్ రాజలింగం తదితరులు ఉన్నారు.

News September 10, 2025

నవంబర్ 10 నుంచి 23వరకు ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ: HNK కలెక్టర్

image

జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో నవంబర్ 10 నుంచి 23 వరకు ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీని నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. కాగా, ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ నిర్వహణపై కలెక్టరేట్లో ఆర్మీ, పోలీస్, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులతో కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించారు. రిక్రూట్‌మెంట్ ర్యాలీని విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం తరఫున అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామన్నారు.

News September 10, 2025

సీమకు కరవును శాశ్వతంగా దూరం చేస్తాం: చంద్రబాబు

image

ఈ ఏడాది రాయలసీమలో తక్కువ వర్షపాతం నమోదైనా అన్ని చెరువులకు నీళ్లు వచ్చాయని CM చంద్రబాబు అనంతపురంలో చెప్పారు. ‘హంద్రీనీవా, గాలేరు నగరి, తెలుగు గంగ ప్రాజెక్టులు TDP హయాంలోనే వచ్చాయి. డ్రిప్ ఇరిగేషన్, ప్రాజెక్టులతో ఎడారి నేలకు జీవం పోశాం. కియా కార్ల పరిశ్రమ తెచ్చాం. రూ.3,850 కోట్లతో హంద్రీనీవా ద్వారా కృష్ణమ్మను కుప్పం వరకు తీసుకెళ్లాం. సీమకు కరవును శాశ్వతంగా దూరం చేస్తాం. ఇది CBN మాట’ అని తెలిపారు.