News September 10, 2025

ఖమ్మం: డిప్యూటీ Dy.CM భట్టికి పోలీసుల వినతి

image

మధిర ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను తెలంగాణ స్టేట్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఖమ్మం-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు, సబ్ ఇన్స్పెక్టర్ జి.ఏసోబు కలిసి వినతిపత్రం అందజేశారు. పోలీస్ సిబ్బందికి బాకీ ఉన్న సరెండర్స్, టీఏలు, జీపీఎఫ్ లోన్లు తక్షణమే మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించాలని కోరారు.

Similar News

News March 4, 2026

‘మద్యం’లో డిజిటల్ చెల్లింపులను పెంచేలా త్వరలో పాలసీ!

image

AP: మద్యం విక్రయాల్లో ప్రస్తుతం 30%గా ఉన్న డిజిటల్ చెల్లింపులను 60%కి పెంచేందుకు ఎక్సైజ్ శాఖ ‘లిక్కర్ డిజిటల్ చెల్లింపులు’ పాలసీని తీసుకురానుంది. దీని ప్రకారం ప్రతి షాపులో డిజిటల్ పేమెంట్ సౌకర్యం తప్పనిసరిగా ఉండాల్సిందే. కొనుగోలుదారులు డిజిటల్ చెల్లింపులు చేస్తామంటే లైసెన్సీలు తిరస్కరించకూడదు. అలాగే ఏ రోజు ఎంత అమ్మారో తెలుసుకునేందుకు ‘ట్రాక్ అండ్ ట్రేస్’ విధానాన్ని కూడా ఎక్సైజ్ శాఖ తీసుకురానుంది.

News March 4, 2026

ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మిర్చి ధరలు ఇలా!

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మిర్చి ధరలు కాస్త రైతులకు ఊరట కలిగించాయి. తేజ రకం మిర్చి క్వింటాలు రూ.19,100 (ఈ నెల 2న ధర రు.19,050), వండర్ హాట్ క్వింటా ధర రూ.35 వేలు (ఈ నెల 2న ధర రూ.34,000), 341 రకం క్వింటా రూ.21, 500 (ఈ నెల 2న రూ.21,000), దీపికా రకం క్వింటా రూ.30 వేలు (ఈ నెల 2న రూ.29,500), దేశి రకానికి ఈ నెల 2న క్వింటా రూ.41 వేలు ధర రాగా, ఇవాళ క్వింటాకు రూ.2,500 తగ్గి రూ.38,500 ధర పలికింది.

News March 4, 2026

తూ.గో: మొబైల్ వాడొద్దన్నారని..!

image

బిక్కవోలు మండలం బలబద్రపురంలో అదృశ్యమైన బాలికను ఐదు గంటల్లోనే గుర్తించినట్లు SI రవిచంద్ర కుమార్ తెలిపారు. మొబైల్ ఎక్కువగా వాడుతోందని తల్లిదండ్రులు మందలించడంతో ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు వెల్లడించారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, గాలింపు చేపట్టి బాలిక ఆచూకీ కనిపెట్టారు. అనంతరం ఆమెను క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు.