News September 10, 2025
తర్లుపాడు MPDOపై సస్పెన్షన్ వేటు

తర్లుపాడు MPDO చక్రపాణి ప్రసాద్‌పై పబ్లిక్ సర్వీసెస్ జిల్లా అధికారులు వేటు వేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎంపీడీవో కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కంటింజెంట్ వర్కర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో చక్రపాణిపై దర్యాప్తు జరిపి ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. MPDOపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. కమిటీ విచారణ, ప్రాథమిక సాక్ష్యంతో సస్పెండ్ చేశారు.
Similar News
News March 12, 2026
మార్కాపురంలో కొత్తగా రూర్బన్ పంచాయతీలు

పంచాయతీ జనాభా వార్షిక ఆదాయం, భౌగోళిక స్వరూపం ఆధారంగా ప్రభుత్వం విభజన చేపట్టింది. ఇప్పటివరకు ఐదు గ్రేడులుగా ఉండగా వాటిని నాలుగు గ్రేడులుగా కుదించింది. కొత్తగా రూర్బన్ పంచాయతీలు ఏర్పాటు చేశారు. మార్కాపురం జిల్లాలో 406 పంచాయతీలు ఉండగా వాటిలో 8 రూర్బన్, 63 గ్రేడ్-1, 108 గ్రేడ్-2, 227 గ్రేడ్-3 పంచాయతీలుగా విభజించారు. రూర్బన్ పంచాయతీలకు గెజిట్ అధికారిని కార్యదర్శిగా నియమించనున్నారు.
News March 12, 2026
పొదిలి: వామ్మో.. ఇలానూ మోసం చేస్తారా..?

పొదిలిలో బుధవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. ఇదే సమయంలో ఓ రెస్టారెంట్ నిర్వాహకుడికి గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి.. ‘మీకు లైసెన్స్ లేదు. తనిఖీలు చేయకుండా ఉండాలంటే రూ.60వేలు ఇవ్వండి’ అని కోరగా.. భయపడిన నిర్వాహకుడు రూ.6వేలు ఫోన్ పే చేశాడు. అసలు అధికారి తనిఖీలకు వెళ్లగా.. మీకు డబ్బులు పంపానని నిర్వాహకుడు చెప్పాడంతో ఆయన అవాక్కయ్యాడు. తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News March 12, 2026
ప్రకాశం: వడగాల్పుల వేళ ముందస్తు చర్యలు

ప్రకాశం జిల్లాలో వడగాల్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు జిల్లా కలెక్టర్ రాజాబాబు అధికారులను అప్రమత్తం చేశారు. ఎండల కారణంగా ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉపాధి హామీ పనుల సమయాల్లో మార్పులు చేయాలని, మధ్యాహ్నం పనులు నిలిపివేయాలని ఆదేశించారు. గ్రామాల్లో తాగునీటి బోర్లు మరమ్మతు చేసి, నీటి కొరత లేకుండా చూడాలని అన్నారు.


