News September 10, 2025
తాండూర్: బిర్యానీలో బొద్దింక.. 25 వేలు జరిమానా

తాండూర్‌లోని శ్రీ దుర్గా గ్యాండర్ రెస్టారెంట్‌లో బిర్యానీలో బొద్దింక కలకలం రేపింది. మంగళవారం మధ్యాహ్నం చికెన్ బిర్యాని తినే సమయంలో కస్టమర్‌కు బిర్యానీలో బొద్దింక కనిపించడంతో రెస్టారెంట్ నిర్వాహకులను నిలదీశారు. వారు నిర్లక్ష్యంగా సమాధానమివ్వడంతో మున్సిపల్ కమిషనర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అధికారులు రెస్టారెంట్‌ను తనిఖీ చేసి రూ.25 వేలు జరిమానా విధించారు.
Similar News
News September 10, 2025
ఈ నెల 12న ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం!

C.P. రాధాకృష్ణన్ ఈ నెల 12న ఉపరాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేస్తారని తెలుస్తోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎల్లుండి ఆయనతో ప్రమాణం చేయిస్తారని అధికార వర్గాల సమాచారం. నిన్నటి ఎన్నికలో రాధాకృష్ణన్ 152 ఓట్లతో ఇండీ కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డిపై గెలిచిన విషయం తెలిసిందే.
News September 10, 2025
SC కార్పోరేషన్ నిధుల దుర్వినియోగం.. జూనియర్ అసిస్టెంట్ సస్పెండ్

ED సంతకం ఫోర్జరీ చేసి ఏలూరు జిల్లా SC కార్పొరేషన్ నిధులను దుర్వినియోగం చేసిన జూనియర్ అసిస్టెంట్ పవన్‌కుమార్‌ను కలెక్టర్ వెట్రిసెల్వి బుధవారం సస్పెండ్ చేశారు. తాజాగా రూ.6 లక్షలు విత్‌డ్రా చేసిన అతను 2019 నుంచి రూ.70 లక్షల వరకు నిధులు దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. పేదల నిధుల దుర్వినియోగంపై అధికారులు పూర్తి స్థాయిలో విచారణ ప్రారంభించారని కలెక్టర్ స్పష్టం చేశారు.
News September 10, 2025
కళా నైపుణ్యాలను వెలికితీయడానికే కళా ఉత్సవ్: డీఈవో

విద్యార్థుల్లో దాగి ఉన్న కళానైపుణ్యతను వెలికితీయడానికే ఉద్దేశంతోనే కళా ఉత్సవ్ పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి (డీఈవో) ప్రొఫెసర్ రాధాకిషన్ అన్నారు. బుధవారం మెదక్ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో కళా ఉత్సవ్ ప్రారంభించారు. డీఈవో మాట్లాడుతూ.. విద్యార్థులలో కళా నైపుణ్యాలను వెలికితీసేందుకు కళా ఉత్సవ్ పోటీలు ఉపయోగ పడతాయని పేర్కొన్నారు.