News September 10, 2025

RDT FCRAపై సీఎం నిర్ణయమేంటి?

image

సేవకు ప్రతిరూపంగా నిలిచిన RDT అనంతపురంలో 1969లో ఏర్పాటైంది. కరవు సీమలో కల్పతరువుగా భాసిల్లుతూ నేటివరకు ఎంతో మంది పేదలను ఆదుకుంది. ప్రస్తుతం RDT సేవలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. కేంద్రం FCRAను రెన్యువల్‌ చేయకపోవడంతో నిరసనలు వెల్లువెత్తాయి. ర్యాలీలు, ధర్నాలు, నిరసనలు చేస్తున్నారు. దీనిపై ఇప్పటి వరకూ మాట్లడని CM… ఇవాళ ‘సూపర్ సిక్స్-సూపర్ హిట్’ సభలో ఏమైనా మాట్లాడతారా అని చర్చ నడుస్తోంది.

Similar News

News March 18, 2026

సూర్యాపేట: ఎక్కడ పర్యటన ఉన్నా.. ముందుగా బడికే!

image

కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలోని 23 మండలాల్లో ఆయన ఏ పర్యటనకు వెళ్లినా ముందుగా స్థానిక బడులను పరిశీలిస్తున్నారు. నేరుగా తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో ముచ్చటిస్తూ విద్యా ప్రమాణాలను అంచనా వేస్తున్నారు. బోధనలో నాణ్యత పెంచేలా టీచర్లకు సూచనలు ఇస్తున్నారు. కలెక్టర్ పనితీరుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

News March 18, 2026

బుద్ధవనం.. పర్యాటకులకు ఆకర్షణ కేంద్రం

image

నాగార్జునసాగర్ సమీపంలోని బుద్ధవనం బౌద్ధ వారసత్వానికి ప్రతీకగా నిలుస్తోంది. బుద్ధుడి జీవితం, బోధనలు, జాతక కథలను ప్రతిబింబించే శిల్పాలు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. ప్రశాంత వాతావరణం, ధ్యానానికి అనువైన ప్రదేశాలతో పాటు థీమ్ పార్కులు, మ్యూజియం పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి.

News March 18, 2026

బాపట్ల: ‘నేర నియంత్రణ లక్ష్యంగా పనిచేయాలి’

image

నేర నియంత్రణ లక్ష్యంగా పోలీసు అధికారులు పనిచేయాలని జిల్లా SP ఉమామహేశ్వర్ ఆదేశించారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో నేర సమీక్ష నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించే లక్ష్యంతో కార్యాచరణ రూపొందించి ముందుకు సాగాలన్నారు. పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతంగా నిర్వహించాలన్నారు. జిల్లాలో గంజాయి డ్రగ్స్ వినియోగాన్ని పూర్తిస్థాయిలో కట్టడి చేయాలన్నారు.