News September 10, 2025

ఆనాటి హాస్యనటుడు పి.ఎల్. నారాయణ మన బాపట్ల వాసే

image

విలక్షణమైన నటుడు, రచయిత, నాటక ప్రయోక్త పి.ఎల్. నారాయణగా పేరుపొందిన పుదుక్కోటై లక్ష్మీనారాయణ (సెప్టెంబర్ 10, 1935 – నవంబరు 3, 1998) ఉమ్మడి గుంటూరు జిల్లా బాపట్లలో జన్మించారు. ఈయన ఎక్కువగా సహాయ పాత్రలు, హాస్య ప్రధానమైన పాత్రలు పోషించారు. 1992లో యజ్ఞం సినిమాలో నటనకు గాను ఉత్తమ సహాయనటుడిగా జాతీయ పురస్కారం అందుకున్నారు. కుక్క, నేటి భారతం, మయూరి, రేపటి పౌరులు సినిమాలకు నంది అవార్డు అందుకున్నారు.

Similar News

News September 10, 2025

గుంటూరు సంయుక్త కలెక్టర్‌గా అశుతోష్ శ్రీవాత్సవ బాధ్యతలు

image

గుంటూరు జిల్లా సంయుక్త కలెక్టర్‌గా అశుతోష్ శ్రీవాత్సవ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో భాగంగా ఆయన గుంటూరుకు వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మీని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను బహూకరించారు. జిల్లా రెవెన్యూ అధికారి ఖాజావలి, డివిజనల్ అధికారి శ్రీనివాసరావు, ఏవో పూర్ణచంద్రరావు తదితరులు సంయుక్త కలెక్టర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

News September 10, 2025

13న గుంటూరులో జాతీయ లోక్ అదాలత్

image

గుంటూరు జిల్లాలో ఈ నెల 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. సాయి కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. వాహన ప్రమాద బీమా, చెక్ బౌన్స్, చిన్న క్రిమినల్, కుటుంబ వివాదాలు, సివిల్, బ్యాంక్, భూ వివాదం, విభజన వంటి కేసులను రాజీ ద్వారా పరిష్కరించుకోవచ్చని చెప్పారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వివినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

News September 10, 2025

రేపు అండర్-14, 17 బాలబాలికల క్రీడా పోటీలు

image

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్-14, 17 బాలబాలికల క్రీడా పోటీలు నిర్వహిస్తామని కార్యదర్శి గోపి ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం ఉదయం 10 గంటలకు స్థానిక బీఆర్ స్టేడియంలో కురుష్, పెదకాకాని జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఆర్చరీ, పల్నాడు జిల్లా నందిగామ జడ్పీహెచ్ఎస్ స్కూల్లో చెపక్ తక్ర విభాగాల్లో పోటీలు ఉంటాయన్నారు. పాల్గొనదలచిన క్రీడాకారులు సంబంధిత స్కూల్ నుంచి బోనఫైడ్ సర్టిఫికెట్ తీసుకురావాలన్నారు