News September 10, 2025
భద్రాద్రి: నేడు, రేపు ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీలకు సెలవు

దమ్మపేట మండలంలోని అప్పారావుపేట, అశ్వారావుపేటలో గల రెండు ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీలకు వరుసగా రెండు రోజులు పాటు సెలవులు ప్రకటిస్తున్నట్లు ఫ్యాక్టరీ మేనేజర్ కళ్యాణ్ తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా వారం రోజులు ఫ్యాక్టరీలకు ఆయిల్‌పామ్ గెలలు అధికంగా వచ్చాయని అన్నారు. ఈ కారణంగా బుధవారం, గురువారం గెలలు కొనబోమని పేర్కొన్నారు. తిరిగి శుక్రవారం నుంచి గెలలు యథావిధిగా కొంటామని, రైతులు సహకరించాలని కోరారు.
Similar News
News September 10, 2025
వెంకటగిరి జాతర.. పోలేరమ్మ ప్రతిమ ఇదే.!

వెంకటగిరి జాతర ఘనంగా జరుగుతోంది. ఇందులో భాగంగా అమ్మవారి పుట్టినిల్లు కుమ్మరి వాళ్ల ఇంట ప్రతిమ సిద్ధం చేశారు. ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ దంపతులు తొలిపూజ చేశారు. మరికాసేపట్లో అమ్మవారిని జీనిగల వారి వీధిలోని చాకలి మండపానికి తీసుకెళ్లనున్నారు. అక్కడే దిష్టి చుక్క, కళ్లు పెడుతారు. ఆ తర్వాత ఊరేగింపుగా అమ్మవారిని మెయిన్ గుడి దగ్గరకు తీసుకెళ్లి ప్రతిష్ఠిస్తారు. గురువారం సాయంత్రం నిమజ్జనం జరగనుంది.
News September 10, 2025
HYD: ‘తొలి భూ పోరాటానికి నాంది పలికిన చాకలి ఐలమ్మ’

తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరమాత చాకలి ఐలమ్మ అని HYD జిల్లా అదనపు కలెక్టర్ కదిరవన్ పళని అన్నారు. బుధవారం చాకలి ఐలమ్మ 40వ వర్ధంతిని నాంపల్లిలోని కలెక్టరేట్‌లో BC సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించారు. అదనపు కలెక్టర్ పళని, DRO వెంకటచారితో కలిసి కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
News September 10, 2025
కస్తూర్బా గాంధీ పాఠశాలలకు 4 ఉత్తమ పురస్కారాలు : డిఈఓ

జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయ అధ్యాపకులకు నాలుగు ఉత్తమ పురస్కారాలు వచ్చినట్లు డిఈఓ అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. ఉత్తమ SOగా రెబ్బెన కేజీబీవీ ప్రత్యేక అధికారి పద్మ, ఉత్తమ టీచర్ గా కాగజ్ నగర్ కేజీబీవీ సీఆర్టీ నిర్మల, ఉత్తమ పీఈటీగా ఆసిఫాబాద్ కేజీబీవీ సువర్ణ, స్పెషల్ కేటగిరీ కింద సిర్పూర్ యు కేజీబీవీ ప్రత్యేక అధికారి స్వప్నలకు ఉత్తమ పురస్కారాలు అందినట్లు తెలిపారు.