News September 10, 2025
ఏలూరు జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలు

ఏలూరు జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో కార్లు, బస్సులను తనిఖీ చేశారు. మాదకద్రవ్యాల రవాణా, పేలుడు పదార్థాలు, అసాంఘిక శక్తులను గుర్తించడం వంటి లక్ష్యాలతో ఈ తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
Similar News
News September 10, 2025
రెండు బైక్‌లు ఢీ.. ఇద్దరి పరిస్థితి విషమం..!

హుకుంపేట మండలం కొంతిలి గ్రామ జాతీయ రహదారి వద్ద బుధవారం రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరి పరిస్థితి విషయంగా ఉండాగా మరో ఇద్దరిని ఆటోలో హుకుంపేట ఆసుపత్రికి తరలించారు. పాడేరు నుంచి బైక్ పై వస్తున్న ఫ్యామిలీని మద్యం మత్తులో బైక్ పై ఎదురుగా వస్తున్న వ్యక్తి ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News September 10, 2025
తూప్రాన్: ఆస్పత్రిని సందర్శించిన కలెక్టర్

తూప్రాన్ పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ బుధవారం సందర్శించారు. మనోహరాబాద్ మండల పర్యటనకు విచ్చేసిన కలెక్టర్ ఆసుపత్రిని సందర్శించి, రోగులను పరిశీలించారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. రక్త పరీక్షలను పూర్తిస్థాయిలో నిర్వహించాలని సూపరింటెండెంట్ అమర్ సింగ్‌కు సూచించారు.
News September 10, 2025
మెదక్: అగ్రిసెట్ ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్

ప్రొపెసర్ జయశంకర్ అగ్రికల్చర్ విశ్య విద్యాలయం నిర్వహించిన 2025-26 అగ్రిసెట్ ఫలితాలలో పెద్ద శంకరంపేటకు చెందిన ప్రజ్ఞ శ్రీ రాష్ట్రస్థాయి ప్రథమ ర్యాంకు సాధించింది. మంగళవారం బీఎస్సీ అగ్రికల్చర్ ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయగా రాష్ట్రస్థాయి మొదటి ర్యాంక్ వచ్చిందని ప్రజ్ఞ పేర్కొన్నారు. తన కుటుంబ సభ్యుల ప్రోత్సాహం వల్లే ఈ ర్యాంకు సాధించినట్లు ఆనందం వ్యక్తం చేసింది.