News September 10, 2025
ఫేక్ వీడియోలపై ఈ నెంబర్‌కి ఫిర్యాదు చేయండి: ఆకే. రవికృష్ణ

సీఎం చంద్రబాబు రైతులకు యూరియా, పురుగుమందుల అధిక వినియోగం తగ్గించాలన్న సూచనలను వక్రీకరించి డీప్‌ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలో ‘CBN warning to farmers’ పేరుతో వస్తున్న ఫేక్ వీడియోపై CID కేసు నమోదు. సైబర్ క్రైమ్స్ ఐజీ ఆకే. రవికృష్ణ మాట్లాడుతూ.. ఫేక్ వీడియోలు సృష్టించడం, ఫేక్ న్యూస్ ఫార్వార్డ్ చేయడం నేరమేనని, అలాంటి వీడియోలపై 1930కు సమాచారం ఇవ్వాలన్నారు.
Similar News
News September 10, 2025
సీమకు కరవును శాశ్వతంగా దూరం చేస్తాం: చంద్రబాబు

ఈ ఏడాది రాయలసీమలో తక్కువ వర్షపాతం నమోదైనా అన్ని చెరువులకు నీళ్లు వచ్చాయని CM చంద్రబాబు అనంతపురంలో చెప్పారు. ‘హంద్రీనీవా, గాలేరు నగరి, తెలుగు గంగ ప్రాజెక్టులు TDP హయాంలోనే వచ్చాయి. డ్రిప్ ఇరిగేషన్, ప్రాజెక్టులతో ఎడారి నేలకు జీవం పోశాం. కియా కార్ల పరిశ్రమ తెచ్చాం. రూ.3,850 కోట్లతో హంద్రీనీవా ద్వారా కృష్ణమ్మను కుప్పం వరకు తీసుకెళ్లాం. సీమకు కరవును శాశ్వతంగా దూరం చేస్తాం. ఇది CBN మాట’ అని తెలిపారు.
News September 10, 2025
కడప జిల్లా పోలీసు శాఖకు నూతన జాగీలం

జిల్లా పోలీసు శాఖకు నూతన జాగిలం సోనును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎస్పీ అశోక్ కుమార్ బుధవారం నూతన జాగీలాన్ని పరిశీలించారు. మంగళగిరి పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఈ జాగీలం వచ్చిందని ఎస్పీ తెలిపారు. నేర పరిశోధన, పేలుడు పదార్థాలను గుర్తించడంలో ప్రత్యేక శిక్షణ పొందిందన్నారు. బిల్జియం మల నాయిస్ జాతికి చెందిన జాగీలమని ఉన్నత అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా డాగ్ స్క్వాడ్ సిబ్బందికి సూచనలు చేశారు.
News September 10, 2025
గుంటూరు సంయుక్త కలెక్టర్‌గా అశుతోష్ శ్రీవాత్సవ బాధ్యతలు

గుంటూరు జిల్లా సంయుక్త కలెక్టర్‌గా అశుతోష్ శ్రీవాత్సవ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో భాగంగా ఆయన గుంటూరుకు వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మీని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను బహూకరించారు. జిల్లా రెవెన్యూ అధికారి ఖాజావలి, డివిజనల్ అధికారి శ్రీనివాసరావు, ఏవో పూర్ణచంద్రరావు తదితరులు సంయుక్త కలెక్టర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.