News September 10, 2025
నంద్యాలలో బీటెక్ స్టూడెంట్ సూసైడ్

నందికొట్కూరు యువకుడు జగదీశ్వర్ రెడ్డి (బీటెక్ 3వ సంవత్సరం, తిరుపతి) నంద్యాల రైల్వే స్టేషన్ 3వ ప్లాట్‌ఫామ్ వద్ద రాత్రి 1 గంట సమయంలో గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి పంపిన ఫీజు డబ్బులు చెల్లించకపోవడంతో కళాశాల వారు విషయం తండ్రికి తెలిపారు. దీంతో మనస్తాపానికి గురై ప్రాణాలు తీసుకున్నట్లు భావిస్తున్నామని రైల్వే ఎస్సై కుమారి తెలిపారు. మృతదేహాన్ని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Similar News
News March 4, 2026
ఇరాన్ కొత్త సుప్రీంలీడర్‌గా ఖమేనీ కుమారుడు!

అయతొల్లా అలీ ఖమేనీ రెండో కుమారుడు మొజ్తాబా ఖమేనీ ఇరాన్ సుప్రీంలీడర్‌గా ఎన్నికైనట్లు ఆ దేశ మీడియా సంస్థ ఇరాన్ ఇంటర్నేషనల్ వెల్లడించింది. మొజ్తాబా ఖమేనీని సుప్రీంలీడర్‌గా ఎన్నుకోవాలని IRGC ఆ దేశ మతపెద్దలను ఒత్తిడి చేసినట్లు సమాచారం. ఖమేనీ కార్యకలాపాల్లో మొజ్తాబా కీలక పాత్ర పోషించారు. మరోవైపు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌తో మొజ్తాబాకు ఎంతోకాలంగా క్లోజ్ రిలేషన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
News March 4, 2026
నేడే మొదటి సెమీఫైనల్.. ఫైనల్ బెర్త్ ఎవరిదో?

T20WC: ఈడెన్ గార్డెన్స్ వేదికగా నేడు సౌతాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య తొలి సెమీఫైనల్ జరగనుంది. 2024లో ఫైనల్ చేరి భారత్ చేతిలో ఓడిపోయిన ప్రోటీస్ ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలనే కసితో రాణిస్తోంది. మరోవైపు నెట్ రన్‌రేట్ కలిసొచ్చి సెమీస్‌కు వచ్చిన కివీస్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది. T20I హెడ్ టు హెడ్ రికార్డ్‌లో 12 విజయాలతో సఫారీలదే పైచేయి. కాగా రాత్రి 7.00కు మ్యాచ్ ప్రారంభమవుతుంది.
News March 4, 2026
ఈ నెల 9న సీఎం చంద్రబాబు నంద్యాల జిల్లా పర్యటన

ఈనెల 9న సీఎం చంద్రబాబు డోన్(M) కొత్తబురుజు గ్రామంలో పర్యటించనున్నారని ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి టీడీపీ కార్యకర్తలతో సమావేశంలో పేర్కొన్నారు. నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారన్నారు. ప్రజల సౌకర్యాలు, రవాణా, భద్రత, వేదిక ఏర్పాట్లపై చర్చించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరవుతారని, అధికారులతో కలిసికట్టుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కార్యకర్తలకు సూచించారు.


