News September 10, 2025

కృష్ణా జిల్లా రైళ్లకు కొత్త స్టాప్‌లు

image

ఉమ్మడి కృష్ణా జిల్లా మీదుగా ప్రయాణించే కింది రైళ్లకు పలు స్టాప్‌లను పునరుద్ధరించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. నం.17207/17208 మచిలీపట్నం-సాయినగర్ షిర్డీ రైళ్లు లాసూర్, గంగేఖర్ స్టేషన్లలో, నం.17211/17212 మచిలీపట్నం- యశ్వంత్‌పూర్‌కు బేతంచర్ల, దొనకొండ, నం.17225/17226 నరసాపూర్- SSS హుబ్లీ రైళ్లకు కురిచేడు, దొనకొండలో స్టాప్ పునరుద్ధరించామని తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు.

Similar News

News March 15, 2026

ATP: ఈనెల 16న అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు

image

అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఈనెల 16న జిల్లా వ్యాప్తంగా వేడుకలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రధాన కార్యక్రమం జరగనుంది. నియోజకవర్గ విజన్ యూనిట్లలో విజయవాడలో నిర్వహించే 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఉదయం 11 గంటలకు ప్రత్యక్ష ప్రసారంగా వీక్షించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.

News March 15, 2026

ఫింగర్ ప్రింట్‌లాగే టంగ్ ప్రింట్స్.. తెలుసా?

image

ప్రతి మనిషికి వేలిముద్రలు ఎలాగైతే వేర్వేరుగా ఉంటాయో నాలుక ముద్రలు (Tongue prints) కూడా అలాగే ఒకరితో ఒకరికి అస్సలు పోలి ఉండవు. ప్రపంచంలో ఏ ఇద్దరు వ్యక్తుల నాలుక ఆకృతి, ఉపరితల నిర్మాణం ఒకేలా ఉండవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కవలల విషయంలోనూ ఇవి భిన్నంగానే ఉంటాయి. ఫ్యూచర్‌లో ఇది అత్యంత నమ్మదగిన బయోమెట్రిక్ గుర్తింపుగా మారే అవకాశం ఉంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో

News March 15, 2026

ప్రజా పంపిణీ బియ్యం దుర్వినియోగం కాకుండా చూడాలి: కలెక్టర్

image

జిల్లాలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందుతున్న బియ్యం దుర్వినియోగం కాకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డా.సత్యశారద ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి ఆమె పౌర సరఫరాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. బియ్యం పక్కదారి పట్టకుండా నిఘా ఉంచాలని సూచించారు. డీఆర్ఓ రామ్ రెడ్డి, జిల్లా పౌర సరఫరాల అధికారి కిష్టయ్య, జిల్లా మేనేజర్ సంధ్యారాణి పాల్గొన్నారు.