News September 10, 2025
విజయవాడ: టెక్నాలజీ ఎక్కువ.. పోలీసులు తక్కువ..!

విజయవాడలో దసరా ఉత్సవాల సందర్భంగా సుమారు 15 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా. ఈ నేపథ్యంలో, గత ఏడాది కంటే తక్కువ సిబ్బందితోనే, సాంకేతిక పరిజ్ఞానం సాయంతో బందోబస్తు నిర్వహించడానికి పోలీసులు సిద్ధమయ్యారు. డ్రోన్లు, ఏఐ సాంకేతికత, సీసీ కెమెరాల ద్వారా భక్తుల క్యూ లైన్లు, ట్రాఫిక్‌ను పర్యవేక్షించనున్నారు. సీపీ రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో ఇప్పటికే పోలీసులు దీనిపై శిక్షణ పొందారు.
Similar News
News September 10, 2025
BREAKING: కూకట్‌పల్లిలో మహిళ హత్య

HYD కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు దారుణం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానిక స్వాన్ లేక్ అపార్ట్‌మెంట్‌లో రేణు అగర్వాల్ (50) అనే మహిళను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. ఆమె కాళ్లు, చేతులు కట్టేసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. కూకట్‌పల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ హత్యకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News September 10, 2025
అలనాటి రోజులను గుర్తు చేసిన హీరోయిన్

90ల్లో టాప్ హీరోయిన్‌గా మీనా విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు. పెళ్లయ్యాక సినిమాలు తగ్గించినా ఈ బ్యూటీ ప్రస్తుతం వయసుకు తగ్గ పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా సైమా అవార్డుల వేడుకలో ఆమె దిగిన ఫొటోలు SMలో వైరలవుతున్నాయి. 48 ఏళ్లు వచ్చినా మీనా అందం ఏ మాత్రం తగ్గలేదని, ఆనాటి రోజులను గుర్తు చేస్తున్నారని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఆమె నటించిన సినిమాల్లో మీకు ఏది ఇష్టం? కామెంట్.
News September 10, 2025
పాక్ జాతీయుడిని స్వదేశానికి పంపిన హైదరాబాద్ పోలీసులు

చట్టవిరుద్ధంగా దేశంలోకి ప్రవేశించిన ఓ పాకిస్థాన్ జాతీయుడిని హైదరాబాద్ పోలీసులు స్వదేశానికి పంపించారు. మహ్మద్ ఉస్మాన్(48) అనే వ్యక్తి నేపాల్ మీదుగా 2011లో భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించాడు. హైదరాబాద్‌లో నాలుగు క్రిమినల్ కేసుల్లో ఇతడు నిందితుడు. శిక్షాకాలం పూర్తయిన తర్వాత ఇతడిని సెప్టెంబర్ 9న అటారీ సరిహద్దు వద్ద పాకిస్థాన్ రేంజర్స్‌కు అప్పగించారు.