News September 10, 2025

గేట్‌కు దరఖాస్తు చేశారా?

image

<>GATE<<>>-2026కు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇంజినీరింగ్‌, ఆర్కిటెక్చర్, సైన్స్, కామర్స్, ఆర్ట్స్, హ్యుమానిటీస్ వంటి 30 సబ్జెక్టులకు ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. విద్యార్థులు సెప్టెంబర్ 28వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7, 8, 14, 15 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో మంచి స్కోరు సాధిస్తే IIT, NIT, IISC వంటి ఇన్‌స్టిట్యూట్లలో ఎంటెక్/ఎంఈ/పీహెచ్‌డీల్లో చేరవచ్చు.

Similar News

News March 26, 2026

పెట్రోల్ సమస్య.. వారికి వర్క్ ఫ్రమ్ హోమ్!

image

హైదరాబాద్‌లో పెట్రోల్ సమస్యతో కొన్ని IT కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని మొదలుపెట్టాయి. విప్రో, యాక్సెంచర్, TCS వంటి పెద్ద కంపెనీలు ఇంటి నుంచి పని చేసే అవకాశాన్ని కల్పిస్తుండగా, మరికొన్ని సంస్థలు 50-50 విధానం తీసుకొచ్చాయి. దీంతో పెట్రోల్ బంకుల వద్ద రద్దీ తగ్గే అవకాశం ఉంది. HYDలో దాదాపు 9.5 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉండగా అందులో సగం మంది బైకులు, కార్లలో రాకపోకలు సాగిస్తారని సమాచారం.

News March 26, 2026

ఏప్రిల్ 25న కవిత కొత్త పార్టీ లాంచ్?

image

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సొంత పార్టీ ఏర్పాటుకు ముహూర్తం ఖరారు చేసినట్లు సమాచారం. ఏప్రిల్ 25న అధికారికంగా పార్టీని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. పార్టీ పేరు ‘తెలంగాణ ప్రజా జాగృతి’గా, గుర్తుగా ‘ధర్మగంట’ను ఎంచుకున్నట్లు టాక్. రేపు నిజామాబాద్‌లో జరిగే సమావేశంలో దీనిపై పూర్తి క్లారిటీ ఇవ్వనున్నారు. అలాగే మహిళా రిజర్వేషన్ బిల్లులో OBC మహిళలకు సబ్ కోటా కల్పించాలని డిమాండ్ చేశారు.

News March 26, 2026

2 రోజుల్లో రూ.15.80 లక్షల కోట్ల లాభం

image

యుద్ధ మేఘాలు తొలగిపోతున్నాయన్న సంకేతాలతో భారత స్టాక్ మార్కెట్లు బుధవారం రికార్డు స్థాయిలో రాణించాయి. కేవలం 2 రోజుల్లోనే ఇన్వెస్టర్ల సంపద ఏకంగా రూ.15.80 లక్షల కోట్లు పెరిగింది. బుధవారం సెన్సెక్స్ 1,205 పాయింట్లు, నిఫ్టీ 394 పాయింట్లు ఎగబాకాయి. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం, అంతర్జాతీయంగా సానుకూల పరిస్థితులు దీనికి ప్రధాన కారణం. శ్రీరామ నవమి సందర్భంగా నేడు మార్కెట్లకు సెలవు.