News September 10, 2025
అద్దంకిలో ఆరోజు ఏం జరిగింది?

సెప్టెంబర్ 9, 2023న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. 2 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా అద్దంకి నియోజకవర్గ వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు భారీ ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా అప్పటి ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి గొట్టిపాటి రవికుమార్ పిలుపు మేరకు కార్యకర్తలు నిర్వహించిన రాస్తారోకో ఫోటోలను టీడీపీ నేతలు SMలో షేర్ చేశారు.
Similar News
News September 10, 2025
ఓదెల రైల్వే ట్రాక్ మరమ్మతులు పరిశీలన

ఓదెల మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో జరుగుతున్న రైల్వే ట్రాక్ మరమ్మతులను డీఆర్‌ఎం గోపాలకృష్ణ బుధవారం పరిశీలించారు. ఈ పనుల కారణంగా ఈ నెల 7 నుంచి 13 వరకు 31వ గేటును మూసివేశారు. ప్రత్యేక రైలులో వచ్చిన ఆయన పనుల పురోగతిని సమీక్షించి, అనుకున్న సమయానికి పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.
News September 10, 2025
BREAKING: నిర్మల్: పిడుగు పడి ముగ్గురు మృతి

పిడుగుపాటుకు గురై ముగ్గురు మృతిచెందిన ఘటన నిర్మల్ జిల్లా పెంబి మండలంలో ఈరోజు చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పెంబి మండలం గుమ్మెన ఎంగ్లాపూర్ గ్రామానికి చెందిన భార్యాభర్తలు అలెపు ఎల్లయ్య, అల్లెపు ఎల్లవ్వతో పాటు మరో వ్యక్తి బండారు వెంకటి గ్రామ సమీపంలోని వ్యవసాయ క్షేత్రాలకు పనులకు వెళ్లి తిరిగి వస్తుండగా పిడుగు పడడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News September 10, 2025
ఖతర్‌పై దాడిని ఖండించిన ప్రధాని మోదీ

ఖతర్ రాజధాని దోహాపై నిన్న ఇజ్రాయెల్ చేసిన <<17661181>>అటాక్‌ను<<>> PM మోదీ ఖండించారు. ‘ఖతర్ అమీర్ షేక్ తమీమ్ బిన్‌తో మాట్లాడాను. సోదర దేశమైన ఖతర్ సార్వభౌమాధికారంపై దాడిని భారత్ ఖండిస్తోంది. ఘర్షణలకు తావులేకుండా చర్చలు, దౌత్యపరంగా సమస్యల పరిష్కారానికి మద్దతిస్తాం. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఖతర్‌లో శాంతి, స్థిరత్వానికి ఇండియా అండగా నిలబడుతుంది’ అని ట్వీట్ చేశారు. అయితే ఇజ్రాయెల్ పేరు ప్రస్తావించకపోవడం గమనార్హం.