News September 10, 2025
కేయూలో LLB పరీక్షలు వాయిదా

కాకతీయ యూనివర్సిటీ(కేయూ) పరిధిలో ఈనెల 12న జరగాల్సిన ఎల్ఎల్‌బీ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఎల్ఎల్‌బీ మూడేళ్ల కోర్సు రెండో సెమిస్టర్(మూడో పేపర్), ఐదేళ్ల లా కోర్సు ఆరో సెమిస్టర్(మూడో పేపర్) పరీక్షలను వాయిదా వేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కే.రాజేందర్ తెలిపారు. వాయిదా వేసిన పరీక్షలను ఈనెల 15న నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
Similar News
News March 13, 2026
NTR: రైతుల ఖాతాల్లో రూ.67.69 కోట్లు జమ

అన్నదాత సుఖీభవ-PM కిసాన్ పథకాల కింద NTR జిల్లా రైతుల ఖాతాల్లో మొత్తం రూ.67.69 కోట్లు విడుదలైనట్లు అధికారులు తెలిపారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 1,18,629 మందికి రూ.47.45 కోట్లు, PM కిసాన్ పథకం ద్వారా 1,01,200 మందికి రూ.20.24 కోట్లు రైతుల ఖాతాల్లో జమయ్యాయి. నియోజకవర్గాల వారీగా తిరువూరు రూ.19.17 కోట్లు, నందిగామ రూ.17.36 కోట్లు, మైలవరం రూ.16.80 కోట్లు, జగ్గయ్యపేట రూ.14.34 కోట్లు విడుదలయ్యాయి.
News March 13, 2026
MBNR: ఈనెల 15 నుంచి అంబేడ్కర్ వర్సిటీ తరగతులు

మహబూబ్‌నగర్ ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ సెమిస్టర్ II, IV, VI తరగతులు ఈనెల 15 నుంచి ప్రారంభం కానున్నాయి. 80 శాతం హాజరు ఉన్న విద్యార్థులనే పరీక్షలకు అనుమతిస్తామని ప్రిన్సిపల్ డాక్టర్ పద్మావతి తెలిపారు. మరిన్ని వివరాల కోసం 73829 29609 నంబరును సంప్రదించాలని కోరారు.
News March 13, 2026
టెన్త్ పరీక్షా కేంద్రాల ఆంక్షలు అమలు: ఎస్పీ నరసింహ

సూర్యాపేట జిల్లాలో రేపటి నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షల నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద 163 BNSS సెక్షన్ అమలు చేస్తున్నట్లు ఎస్పీ కె. నరసింహ తెలిపారు. కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో ఐదుగురి కంటే ఎక్కువ మంది గుంపులుగా ఉండరాదని, జీరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేశామన్నారు.


