News September 10, 2025
పాక్‌తో మ్యాచ్.. నెట్టింట విమర్శలు

ఆసియా కప్‌లో భాగంగా ఈనెల 14న భారత జట్టు పాకిస్థాన్‌తో తలపడనుంది. దాయాదితో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మ్యాచ్ ఆడేందుకు BCCI ఒప్పుకోవడంపై నెట్టింట విమర్శలొస్తున్నాయి. తాజాగా ‘ఆట మొదలెడదామా’ అని గిల్ చేసిన ట్వీట్‌కు మాజీ ఆర్మీ ఆఫీసర్ ఇచ్చిన రిప్లై వైరలవుతోంది. ‘మన శత్రువు పాక్‌తో మ్యాచ్ ఆడే రోజు మీ ఆట అయిపోతుంది’ అని రిప్లై ఇచ్చారు. పహల్గామ్ అటాక్ మర్చిపోయారా? అంటూ నెటిజన్లు సైతం మండిపడుతున్నారు.
Similar News
News March 24, 2026
కాసేపట్లో వర్షం..

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కాసేపట్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. సిరిసిల్ల, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో రాబోయే 2-3 గంటల్లో ఉరుములతో కూడిన వానలు పడతాయని తెలిపారు. అటు హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ ఏరియాల్లో రాబోయే 1-2 గంటల్లో వర్షం పడుతుందని పేర్కొన్నారు. మిగతా ఏరియాల్లో పొడి వాతావరణం ఉంటుందని వివరించారు.
News March 24, 2026
సర్వర్ డౌన్.. ఆగిన రిజిస్ట్రేషన్లు

తెలంగాణలో ఉదయం నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ స్తంభించిపోయింది. రిజిస్ట్రేషన్ల శాఖ ప్రధాన సర్వర్ డౌన్ అవ్వడంతో ఉదయం నుంచి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్, చలాన్ల చెల్లింపు, భూబదలాయింపు రిజిస్ట్రేషన్లు అన్నీ నిలిచిపోయాయి. ఈరోజు స్లాట్ బుక్ చేసుకున్న వారు మళ్లీ బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. సర్వర్ వస్తుందన్న ఆశతో వినియోగదారులు ఇంకా రిజిస్ట్రేషన్ ఆఫీసులలో వేచి ఉన్నారు.
News March 24, 2026
72 గంటల ముందుగా టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే ఫుల్ రిఫండ్

టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీల్లో రైల్వే శాఖ కీలక మార్పులు చేసింది. ఇకపై 72 గంటల ముందుగా టికెట్‌ను రద్దు చేసుకుంటే పూర్తి మొత్తం(నామమాత్రపు ఫ్లాట్ క్యాన్సిలేషన్ ఛార్జీ కట్ అవుతుంది) తిరిగి ఇవ్వనుంది. 72 నుంచి 24 గంటల్లోపు అయితే 25 శాతం, 24 గంటల నుంచి 8 గంటల్లోపు అయితే 50 శాతం కట్ చేయనుంది. 8 గంటల్లోపు అయితే ఎలాంటి రిఫండ్ ఉండదు. ఏప్రిల్ 1 నుంచి 15 మధ్యలో ఈ రూల్స్‌ను అమల్లోకి తేనుంది.


