News September 10, 2025

MNCL: చచ్చిపోవటం తప్పు సోదరా..!

image

MNCL జిల్లాలో పెరుగుతున్న ఆత్మహత్యలు కలవరపెడుతున్నాయి. చిన్నపాటి సమస్యకు క్షణికావేశంలో బలవన్మరణానికి పాల్పడుతున్న ఘటనలు కుటుంబాల్లో విషాదం నింపుతున్నాయి. చిన్న సమస్యలకే యువత నుంచి వృద్ధుల వరకు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 2023లో 414, 2024లో 418, ఈ ఏడాది ఇప్పటి వరకు 275 మంది ఆత్మహత్య చేసుకున్నారు. సమస్యలకు ఆత్మహత్య పరిష్కారం కాదని, ధైర్యంగా ఎదుర్కోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Similar News

News September 10, 2025

బాసర: విద్యార్థులు సమయాన్ని వృథా చేయొద్దు: మంత్రి

image

బాసర త్రిపుల్‌ఐటీకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.1 కోటి నిధులు మంజూరు చేస్తున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. భవిష్యత్తులో విద్యార్థులకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కొత్త యూనిఫామ్‌లను పంపిణీ చేశారు. విద్యార్థులు మొబైల్ ఫోన్లో మునిగితేలుతూ విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దని సూచించారు.

News September 10, 2025

అనకాపల్లి: ‘నేరుగా టెన్త్, ఇంటర్ కోర్సుల్లో ప్రవేశాలు’

image

ఏపీ ఓపెన్ స్కూల్ ద్వారా నేరుగా టెన్త్, ఇంటర్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 15వ తేదీ లోపల దరఖాస్తు చేసుకోవాలని అనకాపల్లి జిల్లా విద్యాశాఖ అధికారి అప్పారావు నాయుడు తెలిపారు. 14 సంవత్సరాలు నిండిన వారందరూ టెన్త్ చదవడానికి అర్హులేనని అన్నారు. టెన్త్‌లో ఉత్తీర్ణత సాధించి కళాశాలలో చేరకుండా ఉండిపోయిన, మధ్యలో మానేసిన వారు కూడా ఇప్పుడు నేరుగా ఇంటర్ కోర్సులో చేరవచ్చు అన్నారు.

News September 10, 2025

VZM: ‘నేపాల్‌లో జిల్లా యాత్రికులు సురక్షితం’

image

విజయనగరం జిల్లా నుంచి మానస సరోవర యాత్రకు వెళ్లిన 61 మందీ క్షేమంగా ఉన్నారని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. వీరిని సురక్షితంగా జిల్లాకు తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టామన్నారు. యాత్రికులతో జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి అనిత స్వయంగా మాట్లాడి వారి యోగక్షేమాలను తెలుసుకున్నారని, వారిని రప్పించేందుకు చర్యలు తీసుకున్నారని చెప్పారు. మంత్రి లోకే‌శ్‌కు జిల్లాకు చెందిన యాత్రికులు 61 మంది జాబితాను పంపించామన్నారు.