News September 10, 2025
కొడుకు పెళ్లికి ముహూర్తం కోసం వెళ్లి ప్రమాదంలో మృతి

కంచికచర్ల మండలం గని ఆత్కూరు గ్రామానికి చెందిన శ్రీనివాసరావు, రజినీ దంపతులు <<17658398>>ఘోర రోడ్డు ప్రమాదంలో<<>> మృతి చెందిన విషయం తెలిసిందే. వారి కుమారుడు హైదరాబాద్‌లో సాప్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి వివాహం కుదిరింది. మూహూర్తం కోసం ఖమ్మం (D) తక్కెళ్లపాడు వెళ్లి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.
Similar News
News March 20, 2026
విద్యుత్ ప్రమాదాల నివారణకు ఎల్సీ యాప్: ఎస్ఈ గౌతమ్ రెడ్డి

విద్యుత్ ఉద్యోగుల భద్రత, ప్రమాదాల నివారణకు కొత్తగా ఎల్సీ యాప్ అందుబాటులోకి తీసుకొచ్చామని ఎన్పీడీసీఎల్ వరంగల్ ఎస్ఈ గౌతమ్ రెడ్డి తెలిపారు. డిజిటల్ పద్ధతిన లైన్ క్లియర్ విధానం అమలులోకి వచ్చిందని అన్నారు. ఈ యాప్ ద్వారా క్షేత్రస్థాయి సిబ్బందికి లీడర్ వివరాలు పనిచేయాల్సిన స్థానం వివరంగా కనిపిస్తాయని చెప్పారు.
News March 20, 2026
జనగామ: పీఎంఎంఎస్ యోజన పథకానికి 13 మంది ఎంపిక

పీఎంఎంఎస్(ప్రధాన మంత్రి మత్స్య సంపద) యోజన పథకంలో భాగంగా మోటార్ సైకిల్ విత్ ఐస్ బాక్స్ యూనిట్లకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను శుక్రవారం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమక్షంలో డ్రా పద్ధతిన ఎంపిక చేశారు. యూనిట్లకు 101 మంది దరఖాస్తు చేసుకోగా జనగామ జిల్లాకు కేటాయించిన 13 యూనిట్లకు గాను డ్రా పద్ధతిలో పారదర్శకంగా 13 మందిని ఎంపిక చేశారు.
News March 20, 2026
శ్రీవారి సన్నిధిలో ఇక కల్తీకి చెక్: సత్యకుమార్

AP: శ్రీవారి లడ్డూ, అన్న ప్రసాదాల్లో నాణ్యత, స్వచ్ఛత పెంచేలా చర్యలు తీసుకున్నామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ‘తిరుమలలో ఏర్పాటైన స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీని CM CBN రేపు ప్రారంభిస్తారు. నెయ్యి, నూనె, పాలు, ఇతర ముడిసరకుల్లో కల్తీని పసిగట్టే పరీక్షలు ఇక్కడ జరుగుతాయి. ఫెస్టిసైడ్స్, ప్రిజర్వేటివ్స్ వంటి అవశేషాలనూ గుర్తిస్తారు. పుణ్య క్షేత్రాల్లో ఇలాంటి ల్యాబ్ ఏర్పాటు కావడం ఇదే తొలిసారి’ అని తెలిపారు.


