News September 10, 2025

ఉమ్మడి పాలమూరు జిల్లాలో నిండిన చెరువులు

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు చెరువులన్నీ నిండాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో 1,086, నాగర్‌కర్నూల్‌లో 1,222, వనపర్తిలో 1,096, నారాయణపేటలో 650, జోగులాంబ గద్వాలలో 375 చెరువులు దాదాపు 90 శాతం వరకు నిండిపోయాయి. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 1.70 లక్షల ఎకరాల్లో వేరుశనగ పంటను సాగు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. మీ దగ్గర చెరువులు నిండాయా..? COMMENT

Similar News

News September 10, 2025

నేపాల్‌లో తెలంగాణ పౌరుల కోసం ప్రత్యేక సెల్: మంత్రి జూపల్లి

image

నేపాల్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న తెలంగాణ పౌరుల సహాయార్థం తెలంగాణ ప్రభుత్వం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసినట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. తెలంగాణ పౌరుల భద్రతే తమ ప్రభుత్వ ప్రాధాన్యమని, ఈ విషయంలో కేంద్ర ఏజెన్సీలు, భారత రాయబార కార్యాలయంతో నిరంతరం సమన్వయం చేసుకుంటున్నామని పేర్కొన్నారు.

News September 10, 2025

ప్రాక్టీస్ షురూ చేసిన హిట్‌మ్యాన్

image

టీమ్ ఇండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్ కోసం రెడీ అవుతున్నారు. తాజాగా ముంబైలో ప్రాక్టీస్ ప్రారంభించారు. అభిషేక్ నాయర్ ట్రైనింగ్‌లో బరువు తగ్గిన రోహిత్.. రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాలో మూడు వన్డేలు జరగనున్నాయి. అటు 2027 వన్డే ప్రపంచకప్ వరకు హిట్‌మ్యాన్ ఆడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

News September 10, 2025

సంగారెడ్డి: విద్యాభివృద్ధికి టీఎల్‌ఎం మేళా దోహదం: ఎఎంఓ

image

టీఎల్‌ఎం మేళా విద్యాభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని జిల్లా ఎఎంఓ బాలయ్య పేర్కొన్నారు. బుధవారం సంగారెడ్డి పట్టణంలోని రావ్స్ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి టీఎల్‌ఎం మేళాను ఎఎంఓ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉపాధ్యాయులు విద్యా బోధన మరింత మెరుగుపరచుకునేందుకు పిల్లల్లో చదువుపై ఆసక్తిని పెంపొందించేందుకు టీఎల్‌ఎం ఉపయోగ పడుతుందని అన్నారు.