News September 10, 2025
REWIND: వికారాబాద్ జిల్లాలో 309 మంది ఆత్మహత్య

వికారాబాద్ జిల్లాలో చిన్నపాటి సమస్యకే ఆత్మహత్యలు చేసుకోవడం ఆందోళన కలిగిస్తుంది. జిల్లాలో 2024, 25 సంవత్సరాల్లో వివిధ కారణాలతో 309 మంది ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం. బతికి సాధించుకోవాలని పెద్దలు ఎంత చెబుతోన్న కొందరు చిన్న చిన్న కారణాలతో తనువు చాలించడం బాధాకరం. ఇకనైనా మనస్తాపాలు వీడి మనసును ప్రశాంతంగా ఉంచుకోండి.
నేడు ఆత్మహత్యల నివారణ దినోత్సవం.
Similar News
News September 10, 2025
ప్రాక్టీస్ షురూ చేసిన హిట్‌మ్యాన్

టీమ్ ఇండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్ కోసం రెడీ అవుతున్నారు. తాజాగా ముంబైలో ప్రాక్టీస్ ప్రారంభించారు. అభిషేక్ నాయర్ ట్రైనింగ్‌లో బరువు తగ్గిన రోహిత్.. రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాలో మూడు వన్డేలు జరగనున్నాయి. అటు 2027 వన్డే ప్రపంచకప్ వరకు హిట్‌మ్యాన్ ఆడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
News September 10, 2025
సంగారెడ్డి: విద్యాభివృద్ధికి టీఎల్‌ఎం మేళా దోహదం: ఎఎంఓ

టీఎల్‌ఎం మేళా విద్యాభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని జిల్లా ఎఎంఓ బాలయ్య పేర్కొన్నారు. బుధవారం సంగారెడ్డి పట్టణంలోని రావ్స్ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి టీఎల్‌ఎం మేళాను ఎఎంఓ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉపాధ్యాయులు విద్యా బోధన మరింత మెరుగుపరచుకునేందుకు పిల్లల్లో చదువుపై ఆసక్తిని పెంపొందించేందుకు టీఎల్‌ఎం ఉపయోగ పడుతుందని అన్నారు.
News September 10, 2025
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1,142 మంది ఆత్మహత్య

తొందరపాటు నిర్ణయాలతో చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఒక్క క్షణం ఆలోచిస్తే నూరేళ్ల జీవితం సాఫీగా సాగుతుంది. ఉమ్మడి WGLలో 2025-జనవరి నుంచి ఆగస్టు వరకు 1,142 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. వరంగల్ కమిషనరేట్ పరిధి(WGL, HNK, జనగామ)లో ఆగస్టు 31 వరకు 785 ఆత్మహత్యలు జరిగితే, BHPL 113, ములుగు 107, MHBD 137 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు.