News September 10, 2025

రెండు రోజుల్లో లిక్కర్ స్కామ్‌పై ఛార్జ్ షీట్..!

image

రెండు రోజుల్లో లిక్కర్ స్కామ్‌పై సిట్ ఛార్జ్ షీట్ దాఖలు చేయనుంది. ఈ కేసులో ఇప్పటికే వైసీపీ నేతల చెవిరెడ్డి భాస్కర్, MP మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసిన సిట్.. వారికి బెయిల్ రాకుండా అడ్డుకుంటోంది. ఉప రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలోనే MPకి మధ్యంతర బెయిల్ మంజూరైంది. మరోవైపు మోహిత్ రెడ్డి, మాజీ మంత్రి నారాయణ స్వామి, విజయానంద రెడ్డిపై సిట్ విచారణ చేపట్టింది. దీంతో వీరి భవితవ్యం ఏంటన్న చర్చ జోరుగా సాగుతోంది.

Similar News

News September 10, 2025

నిర్మల్: సూక్ష్మ హరిత ఆహార కేంద్రం ప్రారంభం

image

నిర్మల్‌లో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యేలు కలిసి సూక్ష్మ హరిత ఆహార కేంద్రాన్ని ప్రారంభించారు. సేంద్రీయ పదార్థాలతో తయారు చేసిన ఆహార పదార్థాలను రుచి చూశారు. అలాగే మహిళా సంఘాల ద్వారా ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించి, వారి ఉత్పత్తులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, వెడ్మా బొజ్జు పటేల్, కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొన్నారు.

News September 10, 2025

శ్రీకాకుళం జిల్లాలో టుడే టాప్ న్యూస్ ఇవే

image

➤నరసన్నపేట: గ్యాస్ లీకై.. వ్యాపించిన మంటలు
➤పాతపట్నం: బురదలో కూరుకుపోయిన లారీ.. ట్రాఫిక్ జామ్
➤టెక్కలి: మండుటెండలో విద్యార్థుల అవస్థలు
➤ఎచ్చెర్ల: అంబేడ్కర్ వర్శిటీ నూతన రిజిస్ట్రార్‌గా అడ్డయ్య
➤సరుబుజ్జిలి: ధర్మల్ ప్లాంట్‌ను వ్యతిరేకించిన ఆదివాసీలు
➤శ్రీకాకుళం: 11న డయల్ యువర్ ఆర్ఎం
➤ఆమదాలవలస: వివాహిత ఆత్మహత్య..నలుగురికి రిమాండ్

News September 10, 2025

చంద్రగ్రహణానికి నలుగురు PMలు బలి: గోయెంకా

image

వివిధ దేశాల ప్రధానులు పదవులు కోల్పోవడంపై పారిశ్రామికవేత్త గోయెంకా ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘‘చంద్రగ్రహణం ఎఫెక్ట్‌తో రెండు రోజుల వ్యవధిలో జపాన్, ఫ్రాన్స్, నేపాల్, థాయిలాండ్ PMలు బలయ్యారు. ఇప్పుడు అందరి చూపు సూర్య గ్రహణంపై పడింది. తర్వాత బలయ్యేది ఓ పెద్ద ‘ఆరెంజ్ టింటెడ్’ లీడర్ కావొచ్చు’’ అంటూ జోస్యం చెప్పారు. దీంతో ఆ లీడర్ ఆరెంజ్ కలర్ హెయిర్‌తో ఉండే ట్రంపేనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.