News September 10, 2025
KNR: విచ్చలవిడిగా ‘అన్‌వాంటెడ్ ప్రెగ్నెన్సీ’ కిట్స్ అమ్మకాలు

ఉమ్మడి KNR వ్యాప్తంగా గర్భవిచ్ఛిత్తి కిట్స్‌ను విచ్చలవిడిగా అమ్ముతున్నారు. ప్రెగ్నెన్సీ వద్దనుకునేవారు నేరుగా మెడికల్ షాపులను సంప్రదిస్తుండడంతో ఈ తతంగం సాగుతోంది. దీనిపై ఔషధ నియంత్రణ పరిపాలన విభాగం ప్రత్యేక దృష్టి పెట్టి తనిఖీలు చేపట్టింది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా, మందులకు రశీదివ్వని షాపులపై చర్యలకు పూనుకుంది. ఇష్టారీతిన KITS వినియోగిస్తే తల్లీబిడ్డకు ప్రమాదమని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
Similar News
News March 16, 2026
ఆస్కార్ అవార్డును అమ్ముకోవచ్చా.. దాని విలువెంత?

ఆస్కార్ అవార్డు గ్రహీతలకు ట్రోఫీ తప్ప ప్రత్యేకంగా నగదు బహుమతి అంటూ ఏమీ ఇవ్వరు. ఒక్కో ట్రోఫీ తయారీకి 400 డాలర్లు ఖర్చు అవుతుంది. అయితే విజేతలు తమకు వచ్చిన బహుమతిని విక్రయించేందుకు వీలులేదు. అకాడమీకి 1 డాలర్‌కు తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. 1951లో ఈ రూల్ తెచ్చారు. 1950కి ముందు ఇచ్చిన అవార్డులకు ఇది వర్తించదు. ఓ ఆస్కార్ అవార్డు అధికారిక విలువ $1 అయినా.. అది తెచ్చిపెట్టే ప్రతిష్ఠ ఎనలేనిది. ఏమంటారు?
News March 16, 2026
పొలంలో ఎలుకల నిర్మూలనకు ముందు ఏం చేయాలి?

వ్యవసాయంలో వాతావరణ పరిస్థితులు, చీడపీడల తర్వాత ఎలుకలు చేసే నష్టం కూడా ఎక్కువగానే ఉంటుంది. పొలాల్లోని కలుగుల్లో ఉండే ఎలుకలను పొగబెట్టడం, రసాయన ఎరలు, ఎర స్థావరాల ఏర్పాటుతో నివారించవచ్చు. అయితే ఎలుక కన్నాల సంఖ్యను బట్టి నివారణా చర్యలు చేపట్టాలి. దీనికి ముందు పొలంలో కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. అలాగే పొలం గట్లమీద ఉండే పొదలను తొలగించాలి. గట్లను పారతో చెక్కి తర్వాత ఎలుకల నిర్మూలన చర్యలు చేపట్టాలి.
News March 16, 2026
జింకు ఫాస్పేట్ ఎరతో ఎలుకల నివారణ

ఎలుకల వల్ల పంట నష్టం ఎక్కువగా ఉంటే పంట కాలంలో ఒక్కసారి మాత్రమే జింకు ఫాస్పేట్ ఎరను వాడాలి. దీనికి ముందుగా విషం లేని ఎరను 20 గ్రాములు (98శాతం నూకలు, 2శాతం నూనె) పొట్లాలుగా చేసి ఎలుక కన్నానికి ముందు ఒకటి చొప్పున ఉంచాలి. ఇలా ఎలుకకు 2 రోజులు అలవాటు చేసి 3వరోజు జింకు ఫాస్పేట్ ఎరను 10 గ్రాములు (96% నూకలు, 2% నూనె, 2% మందు) పొట్లాలుగా కట్టి ఎలుక కన్నంలో ఒకటి చొప్పున వేయాలి. ఇవి తిన్న ఎలుకలు మరణిస్తాయి.


