News September 10, 2025
దగదర్తి ఎయిర్ పోర్ట్‌కు రూ.916Cr తో టెండర్ల ఆహ్వానం

దగదర్తి ఎయిర్ పోర్ట్ నిర్మాణంలో కదలిక వచ్చింది. మొదటి దశ పనులను PPP విధానంలో చేపట్టేందుకు ఏపీఏడీసీఎల్ అంతర్జాతీయ టెండర్‌ను ఆహ్వానించింది. దీని కోసం నవంబర్ 10న ఫ్రీ బిడ్ కాన్ఫరెన్స్‌ను నిర్వహించనుంది. ఈ నిర్మాణానికి 2016లోనే TDP ప్రభుత్వం 13 వందల ఎకరాలతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు సైతం రావడంతో ఉమ్మడి చిత్తూరు, కడప, నెల్లూరు వాసులకు అన్నీ విధాలా లబ్ధి చేకూరనుంది.
Similar News
News September 10, 2025
‘క్రియేటివిటీ మీ సొంతమా.. దరఖాస్తు చేసుకోండి’

27న ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా నెల్లూరు(D)లోని ఆ శాఖా ఆధ్వర్యంలో ఫొటోగ్రఫీ, ప్రత్యేకమైన వీడియోల పోటీలకు జిల్లా పర్యాటక అధికారి ఉషశ్రీ ఓ ప్రకటన విడుదల చేశారు. చూడదగిన ప్రదేశాలు, సాంస్కృతిక వారసత్వ కోటలు, జలపాతాలు, ఈకో-టూరిజం, స్థానిక వంటకాలు తదితరాలను ప్రోత్సహించేలా సృజనాత్మకత ఉన్న వారు ఈ పోటీలకు అర్హులన్నారు. వివరాలకు 94936 68022, 77807 49802 నంబర్లకు 20వ తేదీలోపు సంప్రదించాలన్నారు.
News September 10, 2025
నెల్లూరు సమాచార శాఖ డీడీగా వేణుగోపాల్ రెడ్డి

నెల్లూరు సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా వేణుగోపాల్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కొద్దిరోజులుగా ఆ పోస్టు ఖాళీగా ఉంది. అన్నమయ్య జిల్లాలో పౌర సమాచార శాఖ అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్న ఆయనకు ప్రమోషన్ ఇచ్చి నెల్లూరుకు బదిలీ చేసింది.
News September 10, 2025
మరో రెండు రోజుల్లో సోమశిల గేట్లు ఓపెన్ ?

సోమశిల జలాశయంలో 74 TMCల నీటిమట్టం దాటితే నీటిని విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం జలాశయంలో 70 TMCల నీటిమట్టం నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పెన్న పరివాహక ప్రాంతంలో ఉన్న గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని రెవెన్యూ, పోలీసులకు సమాచారం చేరవేశారు. 11వ తేదీ నుంచి నీటి విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం డ్యాంకు ప్రవాహం కొనసాగుతోంది.