News September 10, 2025
SDPT: స్థానిక ఎన్నికలు.. ఆశావాహుల్లో ఖర్చుల బుగులు

స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో పోటీ చేసే ఆశావాహుల్లో ఖర్చుల బుగులు పట్టుకుంది. కొన్ని గ్రామాల్లో ఆశావాహులు స్థానికులను మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. కొందరు ఎన్నికల తేదీ రాకముందే ఇప్పటినుండే ఖర్చు చేస్తే ఎలా అని సందిగ్ధంలో పడ్డారు. బీసీ రిజర్వేషన్లు తేలాకే స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం ముగ్గు చూపడంతో ఎన్నికల ఆలస్యం ఆశావాహులను కలవరపెట్టింది.
Similar News
News September 10, 2025
రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్‌కు ఘన స్వాగతం

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా స్థానిక సంస్థల ఆదాయ వనరుల పెంపుపై సమీక్షించేందుకు జిల్లా కేంద్రానికి వచ్చిన రాష్ట్ర ఆర్థిక సంఘం ఛైర్మన్ సిరిసిల్ల రాజయ్యకు కలెక్టర్ విజయేంద్ర బోయి, ఎస్పీ జానకిలు మొక్కలను అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం పోలీసులు ఆయనకు గౌరవ వందనం సమర్పించారు.
News September 10, 2025
‘క్రియేటివిటీ మీ సొంతమా.. దరఖాస్తు చేసుకోండి’

27న ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా నెల్లూరు(D)లోని ఆ శాఖా ఆధ్వర్యంలో ఫొటోగ్రఫీ, ప్రత్యేకమైన వీడియోల పోటీలకు జిల్లా పర్యాటక అధికారి ఉషశ్రీ ఓ ప్రకటన విడుదల చేశారు. చూడదగిన ప్రదేశాలు, సాంస్కృతిక వారసత్వ కోటలు, జలపాతాలు, ఈకో-టూరిజం, స్థానిక వంటకాలు తదితరాలను ప్రోత్సహించేలా సృజనాత్మకత ఉన్న వారు ఈ పోటీలకు అర్హులన్నారు. వివరాలకు 94936 68022, 77807 49802 నంబర్లకు 20వ తేదీలోపు సంప్రదించాలన్నారు.
News September 10, 2025
బోధన్‌లో ఉగ్రమూలాలు ఉన్న వ్యక్తి అరెస్ట్

బోధన్‌లో ఉగ్ర మూలాలు ఉన్న ఓ వ్యక్తిని NIA బృందం బుధవారం అదుపులోకి తీసుకుంది. ఐసీస్‌తో సంబంధాలు కలిగి ఉన్న వారిపై నిఘా క్రమంలో NIA అధికారులు డానీష్ అనే వ్యక్తిని ఝార్ఖండ్‌లో అరెస్ట్ చేశారు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు బోధన్‌లో ఉగ్రమూలాలు కలిగిన వ్యక్తిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచి NIA కస్టడీకి తీసుకున్నారు. అతని నుంచి తుపాకీ స్వాధీనం చేసుకోని.. విచారిస్తున్నారని పోలీసు వర్గాలు తెలిపాయి.