News September 10, 2025

నేపాల్‌లో చిక్కుకున్న విశాఖ వాసులు

image

విశాఖ నుంచి విహారయాత్రకు వెళ్లిన 11 మంది నేపాల్‌లో చిక్కుకుపోయారు. అక్కడ అల్లర్లు జరుగుతున్న నేపథ్యంలో తిరిగి వచ్చేందుకు అవకాశం లేకపోవడంతో సహాయం కోసం వారి కుటుంబీకులకు సమాచారం అందించారు. ఎంపీ భరత్, మంత్రి లోకేశ్ దృష్టికి కుటుంబ సభ్యులు తీసుకువెళ్లారు. వీరందరూ ఎల్ఐసీలో ఉద్యోగాలు చేస్తున్నారని, తిరిగి రప్పించేందుకు అన్ని ఏర్పాట్లూ చేస్తామని మంత్రి లోకేశ్ హామీ ఇచ్చారన్నారు.

Similar News

News March 16, 2026

స్కూళ్లు, అంగన్‌వాడీలు నేటి నుంచి ఒంటిపూటే

image

AP, TGలో ఇవాళ్టి నుంచి స్కూల్ విద్యార్థులకు ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. APలో ఉ.7.45 గంటలకు, TGలో ఉ.8 గంటలకు ప్రారంభమై మ.12.30 గంటలకు ముగుస్తాయి. ఇక అంగన్‌వాడీలనూ నేటి నుంచే ఒంటిపూట నిర్వహించాలని AP శిశు సంక్షేమ శాఖ నిర్ణయించింది. పాఠశాలల మాదిరే ఏప్రిల్ 23 వరకు ఇవి కొనసాగనున్నాయి. ఉ.8 గంటల నుంచి మ.12.30 గంటల వరకు కేంద్రాలు తెరిచి ఉంటాయని, చిన్నారుల పేరెంట్స్ గమనించాలని సూచించింది.

News March 16, 2026

ADB: పాపం.. పల్లెల గొంతెండుతోంది..?

image

వేసవి భానుడు భగభగమంటుంటే, ఉమ్మడి జిల్లాలోని పల్లెల గొంతు ఎండుతోంది. చుక్క నీటి కోసం జనం అల్లాడుతున్నారు. మిషన్ భగీరథ గొట్టాలు వెక్కిరిస్తుంటే, బెజ్జూర్, పెంచికల్పేట్ మండలాల ప్రజలు కిలోమీటర్ల దూరం నడచి వాగుల నుంచి నీరు తెచ్చుకుంటున్నారు. చంటిపిల్లలు, వృద్ధులు సైతం ఎండను లెక్కచేయక దప్పిక తీర్చుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు. పైప్‌లైన్ల లీకేజీలు, అధికారుల నిర్లక్ష్యం పేదల పాలిట శాపంగా మారాయి.

News March 16, 2026

విస్తారంగా వర్షాలు

image

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ తెల్లవారుజాము నుంచి హైదరాబాద్ వ్యాప్తంగా వానలు పడుతున్నాయి. అమీర్‌పేట, జూబ్లీహిల్స్, యూసఫ్ గూడ, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్, సనత్ నగర్ తదితర ఏరియాల్లో వర్షం కురిసింది. TGలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, APలోని అల్లూరి, విశాఖ జిల్లాల్లో అక్కడక్కడా వానలు పడుతున్నాయి. మీ ఏరియాలో వాతావరణం ఎలా ఉంది? కామెంట్ చేయండి.