News September 10, 2025

ఆరు గోదాంలు సిద్ధం: DRDA విద్యాచందన

image

కొత్తగూడెం జిల్లాకు రానున్న ఇందిరమ్మ చీరలను నిల్వ చేయడానికి 6 గోదాంలను సిద్ధం చేసినట్లు DRDA ఎం.విద్యాచందన తెలిపారు. కొత్తగూడెం, మణుగూరు, పాల్వంచ, ఇల్లందు, భద్రాచలం, అశ్వారావుపేట ప్రాంతాల్లో ఈ గోదాంలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ నెల 22 నుంచి 30వ తేదీ వరకు చీరల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.. ఒక్కో గోదాంలో 30 వేల నుంచి 60 వేల వరకు చీరలను నిల్వ చేయనున్నామని ఆమె వెల్లడించారు.

Similar News

News September 10, 2025

కృష్ణా: ఫ్లెక్సీ ప్రింటర్స్ అసోసియేషన్ సభ్యులతో SP సమావేశం

image

ఎస్పీ ఆర్. గంగాధరరావు ఫ్లెక్సీ ప్రింటర్స్ అసోసియేషన్ సభ్యులతో ప్రత్యేక సమావేశం బుధవారం నిర్వహించారు. పోలీస్‌ సూచనల ప్రకారం వివాదాస్పద, వ్యక్తిగత దూషణల ఫ్లెక్సీలు ముద్రించకూడదని, ఆర్డర్ ఇచ్చిన వారి పూర్తి వివరాలు నమోదు చేయాలిని సూచించారు. అసోసియేషన్ సభ్యులు చట్టపరంగా సహకరించి సమాజ శాంతికి కృషి చేయమని ప్రతిజ్ఞ చేసుకున్నారు.

News September 10, 2025

ఉపరాష్ట్రపతి ఎన్నికలో 7 పార్టీల క్రాస్ ఓటింగ్?

image

ఉపరాష్ట్రపతి ఎన్నికలో రాధాకృష్ణన్‌కు 15 మంది ఇండీ కూటమి MPలు క్రాస్ ఓటింగ్ చేశారని News18 వెల్లడించింది. ఈ మేరకు NDA వర్గాలు చెప్పాయంది. ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) నుంచి ఐదుగురు, శివసేన(UBT) నుంచి నలుగురు, కాంగ్రెస్ నుంచి ఇద్దరు, DMK, JMM, RJD, NCP(SP)ల నుంచి ఒకరు చొప్పున క్రాస్ ఓటింగ్ చేసినట్లు పేర్కొంది. మరోవైపు NDA తమ MPలకు 2 రోజులు ట్రైనింగ్ సెషన్స్ నిర్వహించి పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకుంది.

News September 10, 2025

మంచిర్యాలలో వందే భారత్ రైలు హాల్టింగ్ టైం

image

ఈ నెల 15వ తేదీ నుంచి నాగ్ పూర్- సికింద్రాబాద్ మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుకు మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో హాల్టింగ్ సమయం ఖరారైంది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే పీఆర్వో శ్రీధర్ ఒక ప్రకటన విడుదల చేశారు. నాగ్‌పూర్‌లో ఉదయం 5 గంటలకు ప్రారంభమయ్యే రైలు 7.20కి బల్లార్షకు, 8.49కి మంచిర్యాల, 12.15 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుతుంది. తిరిగి ఒంటిగంటకు బయలుదేరి మంచిర్యాలకు మధ్యాహ్నం 3.17 గంటలకు చేరుతుంది.