News September 10, 2025

WGL: గురుకుల పాఠశాలల్లో మిగిలిన సీట్లకు దరఖాస్తుల స్వీకరణ

image

వరంగల్ జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 5 నుంచి 9వ తరగతి వరకు మిగిలిన సీట్లను భర్తీ చేయనున్నట్లు జిల్లా అధికారి అపర్ణ తెలిపారు. ఈనెల 12న ఉదయం 9 గంటలకు రాయపర్తి గురుకుల పాఠశాలలో దరఖాస్తులు స్వీకరిస్తారని చెప్పారు. ప్రవేశ పరీక్ష రాసిన విద్యార్థులు తమ హాల్ టికెట్, ఒరిజినల్ కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలని సూచించారు. మెరిట్ జాబితా ఆధారంగా ఈ సీట్లను భర్తీ చేస్తారని పేర్కొన్నారు.

Similar News

News April 1, 2026

వరంగల్: రేపు ప్రజా పాలన గ్రామ, వార్డు సభలు

image

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లాలోని 317 గ్రామాలు, వర్ధన్నపేట, నర్సంపేట మున్సిపల్ పరిధిలోని వార్డుల్లో ప్రజా పాలన గ్రామ, వార్డు సభలు నిర్వహించనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ డా.సత్య శారద తెలిపారు. ముఖ్యమంత్రి సందేశంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాల వెల్లడి, అమలు చేయనున్న పథకాలను ప్రజలకు వివరిస్తారు.

News April 1, 2026

CMR బకాయిలపై కఠిన చర్యలు.. మిల్లర్లకు నోటీసులు

image

హనుమకొండ జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) బకాయిలు పెండింగ్‌లో ఉండడంతో అధికారులు కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. 2014 నుంచి ఇప్పటివరకు 12 మంది రైస్ మిల్లర్లు సీఎంఆర్ ఇవ్వకుండా ఉండగా, వీరివద్ద సుమారు రూ.80.96 కోట్ల విలువైన ధాన్యం బకాయిలు ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటికే నోటీసులు జారీ చేసిన అధికారులు, రెవెన్యూ రికవరీ (ఆర్ఆర్) చట్టం ద్వారా బకాయిల వసూళ్లకు చర్యలు ప్రారంభించారు.

News April 1, 2026

WGL: ఫీజు రీయింబర్స్మెంట్‌కు దరఖాస్తుల ఆహ్వానం

image

2025– 26 విద్యాసంవత్సరానికి వరంగల్ జిల్లాలోని కళాశాలల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, వికలాంగుల ఫ్రెష్, రెన్యువల్ విద్యార్థులు పోస్టుమెట్రిక్, ప్రీమేట్రిక్ ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమాధికారి పీ.భాగ్యలక్ష్మి తెలిపారు. అభ్యర్థులు ఈనెల 20లోపు అధికారిక వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవాలని ఆమె సూచించారు.