News September 10, 2025

లైంగిక వేధింపుల కేసులో పృథ్వీషాకు రూ.100 ఫైన్

image

ఇన్‌ఫ్లుయెన్సర్ సప్నా గిల్‌ను వేధించిన కేసులో టీమ్ ఇండియా క్రికెటర్ పృథ్వీషాకు ముంబై కోర్టు రూ.100 జరిమానా విధించింది. FEB 15, 2023న అంధేరీలోని ఓ పబ్‌లో పృథ్వీషా తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని సప్నా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు FIR నమోదు చేయకపోవడంతో ఆమె కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌కు కౌంటర్ దాఖలు చేయాలని షాకు పలుమార్లు అవకాశమిచ్చినా స్పందించకపోవడంతో ఫైన్ విధించింది.

Similar News

News September 10, 2025

ఈ నెల 12న ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం!

image

C.P. రాధాకృష్ణన్ ఈ నెల 12న ఉపరాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేస్తారని తెలుస్తోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎల్లుండి ఆయనతో ప్రమాణం చేయిస్తారని అధికార వర్గాల సమాచారం. నిన్నటి ఎన్నికలో రాధాకృష్ణన్ 152 ఓట్లతో ఇండీ కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డిపై గెలిచిన విషయం తెలిసిందే.

News September 10, 2025

భారత్ బౌలింగ్.. టీమ్ ఇదే

image

ASIA CUP-2025లో భాగంగా టీమ్ ఇండియా ఇవాళ UAEతో తొలి మ్యాచ్ ఆడుతోంది. భారత కెప్టెన్ సూర్య టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నారు.
భారత్: అభిషేక్ శర్మ, గిల్, సూర్య కుమార్ యాదవ్ (C), తిలక్ వర్మ, సంజూ శాంసన్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి.

>SonyLIVలో లైవ్ మ్యాచ్ చూడొచ్చు.

News September 10, 2025

PHOTO GALLERY: ‘సూపర్ సిక్స్-సూపర్ హిట్’

image

AP: కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక టీడీపీ-బీజేపీ-జనసేన అనంతపురంలో బహిరంగ సభ నిర్వహించాయి. ‘సూపర్ సిక్స్-సూపర్ హిట్’ పేరుతో జరిగిన ఈ సభలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ స్టేట్ చీఫ్ మాధవ్ పాల్గొన్నారు. గత 15 నెలల్లో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమం ఫొటోలను పైన గ్యాలరీలో చూడొచ్చు.