News September 10, 2025
లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి: సంగారెడ్డి ఎస్పీ

ఈ నెల 13న జరగనున్న లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ పంకజ్ పరితోష్ అన్నారు. లోక్ అదాలత్ ద్వారా కేసుల్లో రాజీ చేసుకోవడం వల్ల కక్షలు తగ్గుతాయని ఆయన పేర్కొన్నారు. క్రిమినల్, సివిల్, ఆస్తి వివాదాలు, కుటుంబ, బ్యాంక్ రికవరీ, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్ కేసులను ఈ అదాలత్‌లో పరిష్కరించుకోవచ్చని ఆయన తెలిపారు.
Similar News
News September 10, 2025
VZM: ‘నేపాల్‌లో జిల్లా యాత్రికులు సురక్షితం’

విజయనగరం జిల్లా నుంచి మానస సరోవర యాత్రకు వెళ్లిన 61 మందీ క్షేమంగా ఉన్నారని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. వీరిని సురక్షితంగా జిల్లాకు తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టామన్నారు. యాత్రికులతో జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి అనిత స్వయంగా మాట్లాడి వారి యోగక్షేమాలను తెలుసుకున్నారని, వారిని రప్పించేందుకు చర్యలు తీసుకున్నారని చెప్పారు. మంత్రి లోకేశ్‌కు జిల్లాకు చెందిన యాత్రికులు 61 మంది జాబితాను పంపించామన్నారు.
News September 10, 2025
MHBD: చాకలి ఐలమ్మకు నివాళులు అర్పించిన ఎంపీ

చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌తో పాటు MHBD ఎంపీ బలరాం నాయక్ బుధవారం ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. పీడిత ప్రజల విముక్తి కోసం అహర్నిశలు కృషిచేసిన వీరనారి ఐలమ్మ అని వారు కొనియాడారు. ఐలమ్మ స్ఫూర్తితో రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం ప్రజా పాలనతో అహర్నిశలు పాటు పడతామన్నారు.
News September 10, 2025
MHBD: యూరియాపై రైతులకు ముందస్తు సమాచారం ఇవ్వాలి: కలెక్టర్

యూరియా సమాచారాన్ని రైతులకు ముందస్తుగా అందించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సూచించారు. వ్యవసాయ, సహకార, అన్ని మండలాల ప్రత్యేక అధికారులు, ప్రతి కేంద్రంలో రైతులకు కావాల్సిన తాగునీరు, టెంట్లు సౌకర్యాలు కల్పించాలన్నారు. అదనపు యూరియా కొనుగోలు కేంద్రాల కోసం సంబంధిత అధికారులతో కలిసి ప్రతిపాదనలు సమర్పించాలన్నారు.